మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే అందరికి తెలిసిందే.అచ్చం ఇలాంటి పరిస్థితులనే ప్రస్తుతం అగ్ర రాజ్యం ఎదుర్కుంటోంది.
కరోనా మొదట పుట్టిన చైనాలో ఎలాంటి అలజడులు లేకపోగా, అమెరికాలో మాత్రం మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.మొదటి వేవ్ లో రెండవ వేవ్ అంటూ వరుస వేరియంట్స్ తో అల్లాడి పోతున్న అమెరికాకు కొత్త వేరియంట్స్ తాకిడి ఎక్కువయ్యింది.
వేరియంట్స్ అన్నీ హాలిడే ట్రిప్ వేసుకున్నట్టుగా అమెరికాను మాత్రం వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే డెల్టా దెబ్బకు హడలెత్తి పోయిన అమెరికాను ఒమెక్రాన్ వణికిస్తుండగా తాజాగా మరో కొత్త వేరియంట్ ను గుర్తించినట్టుగా పరిశోధకులు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
అమెరికాలో డెల్టా కేసుల సంఖ్య తగ్గుతున్న సమయంలోనే ఒమెక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 2 లక్షల కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రకటించారు.అయితే ఇన్ని కేసులు ఒక్క సారిగా పెరిగిపోవడానికి కారణం కేవలం ఒమెక్రాన్ మాత్రమే కాదని అందుకు ప్రధాన కారణం మరొక కొత్త వేరియంట్ డెల్మిక్రాన్ అని ప్రకటించారు.
పరిశోధకుల ఈ తాజా ప్రకటనతో అమెరికన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
డెల్టా వేరియంట్, ఒమెక్రాన్ వేరియంట్ లు రెండూ కలిసి డెల్మిక్రాన్ అనే డబుల్ వేరియంట్ గా ఏర్పడినట్టుగా పరిశోధకులు ప్రకటించారు.ఈ కొత్త వేరియంట్ ముఖ్యంగా యూరప్, అమెరికాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు.ప్రస్తుతం ఈ రెండు దేశాలలో అత్యంత వేగంగా కేసులు పెరగడానికి కారణం ఈ వేరియంట్ అని నిర్ధారించారు.
ప్రస్తుతం అన్ని దేశాలలో ఈ పరిస్థితి లేకపోయినా భవిష్యత్తులో కొత్త వేరియంట్ అన్ని దేశాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.అయితే తాజా వేరియంట్ ప్రభావం ప్రమాదకరమైనదా లేదా తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందేనంటున్నారు నిపుణులు.