ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా పలువురు యువ దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు.కొత్త రకం కథలతో కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చారు.
తమ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించారు పలువురు యంగ్ డైరెక్టర్స్.మరికొంత మంది కొత్త ప్రయోగాలు చేశారు.ఇంతకీ ఈ ఏడాది సత్తా చాటిన యువ దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*సానా బుచ్చిబాబు

సుకుమార్ దర్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు.ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఉప్పెన సృష్టించాడు.సరికొత్త ప్రేమ కథను జనాల ముందుకు తీసుకొచ్చాడు.
కరోనా అనంతరం వచ్చిన ఈ సినిమా కొత్త ఊపును తీసుకొచ్చింది.కొత్త యాక్టర్లతో సినిమా చేసి రూ.100 కోట్ల క్లబ్బులో చేరాడు.ప్రస్తుతం తను రెండో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
*లక్ష్మి సౌజన్య

తెలుగు సినిమా పరిశ్రమకు మరో టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య రూపంలో పరిచయం అయ్యింది.వరుడు కావలెను సినిమాతో జనాలకు దగ్గర అయ్యింది.నాగ శౌర్య, రీతు వర్మ హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.
*హసిత్ గోలి

రాజ రాజ చోర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హసిత్.శ్రీ విష్ణు హీరోగా చేసిన ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ముందుకు సాగుతుంది.అద్భుతమైన టేకింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
*విజయ్ కనకమేడల

ఈయన దర్శకత్వం వహించిన నాంది సినిమా జనాలకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.అల్లరి నరేష్ హీరోగా చేసిన ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాపై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసించాడు.ప్రస్తుతం విజయ్.నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
*శ్రీధర్ గాదె

ఎస్.ఆర్ కళ్యాణ మండపంతో సత్తా చాటాడు దర్శకుడు శ్రీధర్.తొలి చిత్రంతోనే కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
*శ్రీ సారిపల్లి

రాజా విక్రమార్కతో స్పై థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.కార్తికేయ హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.చక్కటి వసూళ్లు కూడా సాధించింది.వీరితో పాటు మరికొందరు కొత్త దర్శకులు కూడా సత్తా చాటారు.