విక్టరీ వెంకటేష్ కు( Venkatesh ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రేక్షకుల్లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వెంకటేశ్ కు ఈ మధ్య కాలంలో రానా నాయుడు( Rana Naidu ) వెబ్ సిరీస్ తో పాటు సల్మాన్ తో ( Salman Khan ) కలిసి నటించిన సినిమా షాకిచ్చింది.
ఈ రెండు ప్రాజెక్ట్ లలో వెంకటేశ్ పాత్రల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే వరుసగా వివాదాల్లో చిక్కుకున్నా ఈ రెండు ప్రాజెక్ట్ ల ద్వారా వెంకటేశ్ కు పాన్ ఇండియా గుర్తింపు దక్కింది.
వెంకటేశ్ తర్వాత మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్ కాగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుందని తెలుస్తోంది.రెండు ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థలు వెంకటేశ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటున్నాయని ఇందుకోసం భారీ మొత్తం ఆఫర్ చేశాయని తెలుస్తోంది.
వెంకటేశ్ గత రెండు ప్రాజెక్ట్ లు ఆయనకు మేలు చేశాయని వెంకీ తన గమ్యాన్ని చేరుకున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.పాన్ ఇండియా అప్పీల్ సాధించిన వెంకటేశ్ కు రాబోయే రోజుల్లో కూడా విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రానా నాయుడు సీజన్2 కూడా తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.ట్రోల్స్ తో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న ఈ నటుడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
వెంకటేశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.వెంకటేశ్ వయస్సు 62 సంవత్సరాలు కాగా ఆయన కొడుకు సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వెంకటేశ్ కొడుకుకు సినిమాలపై ఆసక్తి ఉందో లేదో తెలియాల్సి ఉంది.అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వెంకటేశ్ మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.