అందమైన జుట్టు కావాలని ఎవరికి ఆశగా ఉండదు.జుట్టుని సరైన పద్ధతిలో దువ్వుకుంటే ముఖానికి అది అందించే అందమే వేరు.
అందుకే జుట్టు నున్నగా, నల్లగా, పెద్దగా ఉండాలని ఆశపడతారు అందరు.కాని చాలామందిని తీవ్రంగా ఇబ్బందిపెట్టే సమస్య “హెయిర్ ఫాల్’.
జుట్టుకి చేతులు తగలడమే కష్టం, జుట్టు రాలిపోతూ ఉంటుంది.దువ్వెనతో దూసుకున్న ఇబ్బందే, దువ్వెనంతా వెంట్రుకలే.
ఈ హెయిర్ ఫాల్ కి కారణాలేంటో, అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసుకుందాం.
* వంశపారంపర్య సమస్యల వలన జుట్టు రాలిపోవచ్చు.
మీ నాన్నకి, తాతయ్యకి హెయిర్ ఫాల్ సమస్య ఉంటే, అది మీదాకా వస్తుంది.చాలామంది ఆడవారికి కూడా జుట్టు తక్కువగా ఉండటం, సరిగా పెరగక పోవడం జరుగుతుంది.
అంతా జీన్స్ లోనే దాగుంది.
* ఆడవారు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే, హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది.
గర్భనిరోధక మాత్రలు హార్మోనులుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.అందుకే ఈ సమస్య వస్తుంది.
* డిప్రెషన్, ఒత్తిడి వలన కూడా జుట్టు రాలిపొతూ ఉంటుంది.ఎన్ని మానసిక ఇబ్బందులు ఉంటే, శరీరానికి అన్ని సమస్యలు.
కాబట్టి మనుషులు నవ్వుతూ ఉండటం ఎంతో ముఖ్యం.
* విటమిన్ ఏ యొక్క సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నా, హెయిర్ ఫాల్ సమస్య పుట్టుకొస్తుందని కొత్తగా జరిగిన అధ్యయనాలు వెల్లడించాయి.
* సడెన్ గా బరువు తగ్గితే కూడా జుట్టు రాలిపోతుంది.అలా ఒక్కసారిగా బరువు తగ్గిన ముఖాలని ఓసారి గమనించి చూడండి, హెయిర్ ఫాల్ వలన అందం ఎంతలా చెడిపోతుందో.
* శరీరంలో జ్వరం ఎక్కువ కాలం ఉంటే అది హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది.15-20 రోజులపాటు జ్వరంతో బాధపడితే, జుట్టు రాలడం మొదలవుతుంది.
* రోజు తినే ఆహారంలో ప్రోటీన్ల శాతం తక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది.