ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించుకున్నవారు అనుకోకుండా ఒకరోజు కలవగా తాము ప్రేమించుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలను బయటపెడతానంటూ తన ప్రియ రాలి భర్తని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని అరిసికేరే ప్రాంతానికి చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించాడు.
అయితే వినయ్ కుమార్ చెప్పిన మాయమాటలు నమ్మి ఆ యువతి కూడా అతడిని ప్రేమించింది.ఈ ప్రేమలో ఉన్న ఇద్దరు చాలా హద్దులను దాటేశారు.
అంతేగాక అప్పుడప్పుడు ఏకాంతంగా కలుసుకున్న సమయంలో ఫోటోలు దిగారు.అయితే ఆ తర్వాత తమ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి ఎవరికి వారు పెళ్లి చేసుకొని దూరంగా వెళ్లిపోయారు.
అయితే తాజాగా వినయ్ కుమార్ కి తన మాజీ ప్రేమికురాలు కనబడింది.దాంతో వినయ్ కుమార్ మాట మాట కలుపుతూ తాము ప్రేమించుకుంటున్న సమయంలో ఏకాంతంగా ఉన్న కొన్ని ఫోటోలు చూపించి తనకు అడిగినంత డబ్బు ఇవ్వమని లేకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించ సాగాడు.అయితే ఈ బెదిరింపులకు ఆ యువతి లొంగలేదు.దీంతో వినయ్ ఎలాగో తన ప్రేమికురాలు భర్త ఫోన్ నెంబర్ సంపాదించి అతడికి వారి ప్రేమాయణం గురించి చెప్పాడు.
అంతేగాక నీ భార్యకి సంబంధించిన కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయని వాటిని బయటపెడితే మీ పరువు పోతుందని, కాబట్టి నేను అడిగినంత డబ్బు ఇస్తే ఆ ఫోటోలు మీకు ఇచ్చేస్తానని ఆ యువతి భర్తను బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ యువతి భర్త దగ్గరలో ఉన్నటువంటి హాసన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఇ రిమాండ్ కి తరలించారు.