ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌పై భారత్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినందుకుగానూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలోని కోర్టులో జుకర్‌బర్గ్‌తో పాటు 49 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు.
నిజానికి అఖిలేశ్ యాదవ్‌కు వ్యతిరేకంగా జూకర్ బర్గ్ పోస్టు పెట్టకపోయినా ఆయన ప్లాట్ ఫాం కారణంగానే.అఖిలేశ్‌ను కించపరిచే ప్రయత్నం జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
సరాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి.జూకర్ బర్గ్ తో పాటు మరో 49 మందిపై కించపరిచే కామెంట్లు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కించపరుస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిని స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే జూకర్ బర్గ్ తప్పించి మిగిలిన వారిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.అఖిలేశ్‌పై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సదరు ఫేస్‌బుక్ పేజ్ అడ్మినిస్ట్రేటర్‌ను ఎంక్వైరీ చేస్తున్నామన్నారు.
కాగా.అక్టోంబర్ తొలివారంలో దాదాపు ఏడు గంటలపాటు తలెత్తిన అంతరాయం కారణంగా ఫేస్‌బుక్ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.ఈ నష్టం అంచనా దాదాపు 7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.52 వేల కోట్లు) నష్టం వచ్చినట్లు బ్లూమ్స్ బర్గ్ తదితర అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి.అంతేకాదు, ప్రపంచవ్యాప్త అంతరాయం కారణంగా ఫేస్‌బుక్ షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్ సంపద సైతం ఆవిరయ్యింది.
మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పావులు కదుపుతున్నారు.చివరికి చిన్నాచితకా పార్టీలతో కూడా ఆయన పొత్తు పెట్టుకుంటున్నారు.
అయితే మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఢిల్లీకి రాచబాటను వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.ఇక కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాడుతోంది.
అధికారమే లక్ష్యంగా సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఇన్‌ఛార్జిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.