బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ క్రమంలోనే వీరి పెళ్లి డిసెంబర్ 9 వ తేదీ రాజస్థాన్లో జరగనుంది.ఇకపోతే ఇప్పటికే కత్రినా విక్కీ కౌశల్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా వీరి వివాహం తర్వాత ఈ జంట ముంబైలోని ఒక అపార్ట్మెంట్ లో రెంట్ కి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.వీరు ఉండే అపార్ట్‌మెంట్ ఎంతో విలాసవంతమైన అన్ని సౌకర్యాలతో కూడుకొని ఉందని ఆ అపార్ట్మెంట్ కు నెలకు ఎనిమిది లక్షల రూపాయలను అద్దె చెల్లించబోతున్నట్లు సమాచారం.
అయితే ఇదే అపార్ట్‌మెంట్ లోనే మరొక స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట నివసిస్తోంది.ఈ జంట ఏకంగా రెండు ఫ్లోర్ లను అద్దెకు తీసుకోగా.
విక్కీ కత్రినా జంట ఒక ఫ్లోర్ ని అద్దెకి తీసుకున్నట్లు సమాచారం.ఇలా స్టార్ సెలబ్రెటీలు ఒకే అపార్ట్‌మెంట్ లో అద్దెకు ఉండడంతో ఆ ఫ్లాట్ ఎలాంటి సౌకర్యాలతో ఉంటుందో అర్థమవుతుంది.
ఇక కత్రినా జంట ఈ ఫ్లాట్ ను అద్దెకు ఉండడం కోసం మూడు సంవత్సరాల అగ్రిమెంట్ కుదుర్చుకుని ఇప్పటికే కోటి 75 లక్షల రూపాయల అడ్వాన్స్ ముందుగానే చెల్లించారని తెలుస్తోంది.