భారతదేశంలోని మొట్టమొదటి మసీదు గురించి మీకు తెలుసా?

భారతదేశంలోని పురాతన మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.ఈ మసీదును చేరమాన్ జుమా మసీదు అని పిలుస్తారు.

 Cheraman Juma Masjid: India's First Mosque Built During Prophet Mohammad's Lifet-TeluguStop.com

ఈ మసీదుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.చేరమాన్ జుమా మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లా పరిధిలోని కొడంగలూరు తాలూకాలో ఉంది.

ఈ మసీదు దాని లౌకిక భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఈ మసీదు మహమ్మద్ ప్రవక్త కాలంలో నిర్మించార‌ని చెబుతారు.

ఈ మసీదును భారతదేశపు మొదటి మసీదు అని కూడా అంటారు.మసీదు అనేక సార్లు పునరుద్ధరణ జ‌రిగింది క్రీ.శ.629లో ఈ మసీదు నిర్మాణం జరిగిందని చెబుతారు.భారతీయ ఉపఖండంలోని పురాతన మసీదు ఇదే కావ‌డంతో ఇప్పటికీ ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు.ఈ మసీదుకు రాజా చేరమాన్ పెరుమాళ్ పేరు పెట్టార‌ని చెబుతుంటారు.ఈ రాజు పెరుమాళ్ ఒకసారి అరేబియా వెళ్ళాడు.ఇక్కడ అతను ఒక సూఫీ సన్యాసిని కలిశాడు.
దీని తరువాత రాజా చేరమాన్ ఇస్లాం స్వీకరించాడు.తన పేరును తాజుద్దీన్‌గా కూడా మార్చుకున్నాడు.అతను జెడ్డా రాజు సోదరిని వివాహం చేసుకున్నాడు.ఆ తర్వాత జెడ్డాలో నివాసం ఉండ‌సాగాడు.

రాజు తన మరణానికి ముందు కేరళ పాలకులకు కొన్ని లేఖలు రాశాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.ఈ లేఖల్లో కేరళలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేయాలని కోరారు.

జెడ్డా రాజు కేరళకు వచ్చి కొడంగలూరు రాజును కలిశాడు.ఈ సమావేశంలో కొడంగల్లు రాజుకు మసీదు నిర్మాణానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

ఈ మసీదు నిర్మాణం హిందూ మత ప్రభావంతో హిందూ కళ మరియు వాస్తుశిల్పం ఆధారంగా జరిగిందని చాలా మంది చెబుతారు.ఈ మసీదులో ముగ్గురు గొప్ప ఇస్లామిక్ అనుచరుల సమాధులు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube