సిల్క్‌స్మిత( Silksmith ) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడంటే స్టైల్ మారింది కానీ, ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు.
జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్క్ స్మిత, డిస్కో శాంతి, అనురాధ.ఈ కోవకే చెందుతారు.
అప్పట్లో వీరు తమదైన డాన్సులతో ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేవారు.అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తప్పనిసరి.
తర్వాతి కాలంలో ఐటమ్ సాంగ్స్‌ను హీరోయిన్స్‌తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్స్‌గా ఛలామణిలోకి తీసుకు రావడం జరిగింది.అయితే అప్పట్లో ఐటమ్ సాంగ్స్‌లో హీరోతోపాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్ ఉండేవారు.
కానీ, చిరంజీవి( Chiranjeevi ) హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘కొండవీటి రాజా’ ( Kondaveeti Raja )చిత్రంలోని ఒక పాటకోసం ముగ్గురిని తీసుకోవాల్సి వచ్చిందట.దానికి కారణం సిల్క్‌స్మిత అని మీకు తెలుసా.
అవును.ఆ సినిమాలోని “యాల యాలా.ఉయ్యాలలోనా” అనే ఐటమ్ సాంగ్‌ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్‌తో చిత్రీకరించారు దర్శకుడు రాఘవేంద్రరావు( Director Raghavendra Rao ).ఈ సాంగ్‌లో నటించేందుకు మొదట సిల్క్ స్మితను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆమెకి రూ.25 వేలు రెమ్యునరేషన్ కూడా ముందుగానే చెల్లించారట.ఇక ఆ పాటకోసం చెన్నయ్‌లోని వాహిని స్టూడియోలో రూ.5 లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు.ఆరోజుల్లో సిల్క్‌స్మిత చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది.
ఆ కారణంగానే స్మిత కాల్షీట్లు నాలుగు నెలల ముందుగానే చిత్ర యూనిట్ బుక్ చేసుకుంది.ఇక షూటింగ్ రోజు రానే వచ్చింది.
ఆరోజు సెట్లో అడుగుపెట్టిన ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారట.విషయం ఏమిటంటే, స్మిత అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా హెయిర్ స్టైల్ చిందరవందరగా ఉందట.
ఇక పాటల చిత్రీకరణ విషయంలో, హీరోయిన్లను అందంగా చూపించే రాఘవేంద్రరావుకి ఆమె గెటప్ నచ్చలేదు.ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్ స్టైల్ మార్చమన్నారు.కానీ స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు సరికదా హెయిర్ స్టైల్ బాగానే ఉందంటూ వాదనకు దిగడంతో ఆమెతో డిస్కస్ చేయడం ఇష్టంలేని రాఘవేంద్రరావు ఆమెను సినిమా నుంచి తొలగించి ఆ పాటలో పల్లవిని జయమాలినితో, మరో చరణాన్ని అనురాధతో తీశారు.అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది.
మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది.ఆ విధంగా ఈ పాటలో మనకి ముగ్గురు భామలు కనిపిస్తారన్నమాట.