నల్లగొండ జిల్లా:దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ( Traffic signal system ) అస్తవ్యస్తంగా తయారై వాహనదారులు,ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలో రాజీవ్ చౌక్ లో మాత్రమే సిగ్నల్ వ్యవస్థ ఉన్నది.
కానీ,అది ఇంతవరకు పని చేసిన దాఖలాలు లేవు.పట్టణంలో బైపాస్ రోడ్డు వెంట పదుల సంఖ్యలో ఉన్న రైస్ మిల్లులకు రైతులు ధాన్యాన్ని తరలించే క్రమంలో బైపాస్ రోడ్డు ప్రధానంగా వాడుతారు.
అంతేగాకుండా పట్టణ బైపాస్ రోడ్డులో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి.ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వలన వా
హనదారులు మితిమిరిన వేగంతో బైపాస్ రోడ్డు దాటే సమయంలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.
పట్టణంలోని రాజీవ్ చౌక్, బంగారుగడ్డ,ఈదులగూడెం,హోసింగ్ బోర్డు,బస్టాండ్,రైల్వే స్టేషన్ రోడ్డు,నాగార్జున సాగర్ ఫ్లైఓవర్,నల్గొండ బైపాస్,నంది పహాడ్ బైపాస్,గూడూరు బైపాస్,అవంతిపురం వ్యవసాయ మార్కెట్, చింతపల్లి రోడ్ తదితరుల ప్రాంతాలలో నిత్యం వేలాది మంది వాహనాలు వెళ్తుంటాయి.కానీ,పట్టణ పరిధిలో ఎక్కడ కుడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేదు.
గత కొన్ని రోజుల క్రితం కారు ఆక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది,చింతపల్లి బైపాస్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
పట్టణ పరిధిలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా అక్కడక్కడా నామామాత్రంగా ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా ప్రయత్నం చేస్తున్నారు.కానీ,రాత్రి పూట అలాంటి చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాలు దూసుకుపోతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చొరవ తీసుకొని పట్టణంలో ఆధునిక పద్ధతుల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.