తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు( Telangana Intermediate Exam Results ) విడుదలయ్యాయి.ఈ మేరకు ఒకేసారి మొదటి, రెండో సంవత్సరం రిజల్ట్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం( Burra Venkatesham ) విడుదల చేశారు.
ఇంటర్ పరీక్షలను మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాశారని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం( Inter First Year Results ) పరీక్షను 4,78,527 మంది విద్యార్థులు రాయగా.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షను 4,43,993 మంది విద్యార్థులు రాశారని వెల్లడించారు.ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి అని పేర్కొన్నారు.ఇంటర్ ఫస్టియర్ లో 60.01 శాతం ఉత్తీర్ణత సాధించగా.ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 64 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి.సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా( Mulugu District ) మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.