మోతె మండలంలో స్వైర విహారం చేస్తున్న వీధికుక్కులు,కోతులు

సూర్యాపేట జిల్లా:మోతె మండలం వ్యాప్తంగా వీధి కుక్కలు,కోతులు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఈ నెల 5 న అన్నారిగూడెం గ్రామానికి చెందిన వృద్ధ మహిళ శివరాత్రి లింగమ్మపై కోతులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా ఆమెను చికత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.12 వ తేదీన ఉర్లుగొండ గ్రామానికి చెందిన వృద్ధురాలు పొలిమేర వెంకటమ్మ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.ఈ మహిళను కూడా ప్రభుత్వ ఆస్పత్రికె తరలించారు.

 Stray Dogs And Monkeys Roaming Freely In Mote Mandal , Stray Dogs , Mote Mandal,-TeluguStop.com

ఈ వరుస ఘటనలతో గ్రామాల్లో ఉండే వృద్ధ మహిళలు,చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వణికిపోతున్నారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వీధి కుక్కలు, కోతుల బారి నుండి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల నుండి వాటిని తరలించే ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణమే చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube