నేలను తాకుతున్న విద్యుత్ తీగలు...!

సూర్యాపేట జిల్లా:ప్రమాదకంగా మారిన విద్యుత్ స్తంభాల తీగలతో నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నప్పటీకి, విద్యుత్ అధికారుల తీరు మారడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు వెంట,పంట పొలాల పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒక పక్కకు వాలిపోయి,కిందకు పడిపోయే పరిస్థితి ఉందని,స్తంభం వాలిన ధాటికి అదే స్తంభానికి మరోపక్క స్తంభానికి కలిపిన విద్యుత్ తీగలు మనుషులకు తగిలేలా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని వాపోతున్నారు.

 Electric Wires Touching The Ground , Electric Wires, Electricity Authorities-TeluguStop.com

కంప చెట్లు బాగా పెరిగి విద్యుత్ తీగలకు తగిలేలా ఉన్నాయని,ఇప్పటికే వేసంగి వరి పంటకు రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే రైతులకు ప్రమాదం పొంచి ఉందని,అటు రైతులకు, ఇటు ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube