సూర్యాపేట జిల్లా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో గంజాయి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ గంజాయి మరే ఇతర మాదక ద్రవ్యాలు రవాణా చేసినా,వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాంటి వారి గురించి మాకు తగిన సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.