సీతాఫలం..
( Custard apple )ప్రస్తుత సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో ఒకటి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందికి సీతాఫలం మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్.
అందుకు కారణం దాని రుచే.అద్భుతమైన టేస్ట్ తో పాటు సీతాఫలంలో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ నిండి ఉంటాయి.
సీతాఫలంను డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు.సీతాఫలం లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
ఇది గుండెకు ముప్పు తగ్గిస్తుంది.
సీతాఫలం లో ఉండే డైటరీ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను ( Digestive system )చురుగ్గా మారుస్తుంది.అలాగే కొందరు బరువు పెరగాలని తెగ ప్రయత్నిస్తుంటారు.అలాంటి వారికి సీతాఫలం ఒక వరం అని చెప్పుకోవాలి.
సీతాఫలం గుజ్జు, పాలు, తేనె కలిపి మిక్సీ పట్టి రోజు ఉదయం తీసుకుంటే చక్కగా బరువు పెరుగుతారు.సీతాఫలం డైట్ లో ఉంటే రక్తహీనత( Anemia ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.ఎముకలు పుష్టిగా మారతాయి.
అయితే నోరూరించే సీతాఫలంను షుగర్ వ్యాధి( Diabetics ) ఉన్నవారు తినొచ్చా.? తినకూడదా.? ఈ డౌట్ చాలా మందికి ఉంది.సీతాఫలం తియ్యగా ఉండటం వల్ల ఎక్కువ శాతం మంది తినకూడదని భావిస్తుంటారు.
సీతాఫలం అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో అని భయపడుతుంటారు.ఈ క్రమంలోనే నోరును కట్టేసుకుని కూర్చుంటారు.కానీ, సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది.అందువల్ల షుగర్ వ్యాధి ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా సీతాఫలాన్ని తినవచ్చు.
కాకపోతే రెగ్యులర్ గా మాత్రం తీసుకోరాదు.అలా తింటే మొదటికే మోసం వస్తుంది.
వారంలో రెండు లేదా మూడు సార్లు సీతాఫలం తింటే( Custard apple ) ఎలాంటి సమస్య రాదు.సీతాఫలంలో ఉండే పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు మధుమేహం వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి.