రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan )దూకుడు ప్రదర్శిస్తున్నారు.వారాహి యాత్ర ద్వారా జనసేన బలాన్ని పెంచుకుంటూనే తమ రాజకీయ ప్రత్యర్థైన వైసీపీని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM jagan ) ను టార్గెట్ చేసుకునే పవన్ విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రశ్నిస్తూ, ప్రజల్లో ఆ అంశాలపై చర్చ జరిగేలా చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఊహించని స్థాయిలో ప్రజల మద్దతు లభిస్తుందనే ఆశలతో పవన్ ఉన్నారు.
అయినా వైసీపీ బలాన్ని తక్కువగా అంచనా వేయలేమనే నిర్ణయానికి వచ్చిన పవన్ , వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.ప్రస్తుతం బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్నాయి.
టిడిపిని కలుపుకు వెళ్లే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయంలో బిజెపి వైఖరి ఎలా ఉన్నా… కచ్చితంగా బలమైన టిడిపి( TDP party )తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే అనుకున్న విజయాన్ని సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో పవన్ ఉన్నారు.ప్రస్తుతం సీట్ల కేటాయింపు విషం పైన చర్చలు జరుగుతున్నాయి ఒత్తులు వ్యవహారం పై ఇంకా ఒక అంగీకారం కుదరకుండానే ఇంకా చర్చలు దశలో ఉండగానే, పవన్ మాత్రం సీఎంకు కుర్చీ విషయంలో సంచలన ప్రకటనలు చేస్తున్నారు.పదేళ్లు రాజకీయంలో ఉన్నాను.
సీఎం గా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పవన్ చేస్తున్న కామెంట్స్ అటు టిడిపిలోను ఇటు బిజెపి( BJP party )లో ను గందరగోళం కలిగిస్తున్నాయి.వ్యక్తిగతంగా తనను తిట్టినా పడతాను కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ముందుకు వెళ్తాను అంటూ పవన్ చెబుతున్నారు.
వైసీపీ ( YCP party )ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి ప్రస్తావిస్తూ, ప్రతి పార్టీలోను లోటుపాట్లు ఉంటాయని , అందుకే ఈసారి ఓట్లు చీలనివ్వను అంటూ పవన్ చెబుతున్నారు.వైసీపీ చేసిన పనులు అన్ని బేరిజు వేసి చూస్తే.టిడిపి పాలనే మెరుగనిపిస్తుంది అంటూ పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో టిడిపి విషయంలో పవన్ ఏ స్థాయిలో సానుకూలంగా ఉన్నారు అనేది అందరికీ అర్థమవుతుంది .ఇదిలా ఉంటే సీఎం కుర్చీ విషయంలోనే రెండు పార్టీల మధ్య క్లారిటీ రాకపోవడంతోనే , పొత్తుల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు .ఒకవైపు చర్చలు టిడిపి తో జరుగుతున్నా, సీఎం అవుతాను అంటూ పవన్ మాట్లాడడం టిడిపి అగ్ర నేతలకు మింగుడు పడడం లేదు.