సాయి పల్లవి .( Sai Pallavi ) నమ్ముకున్న ఆదర్శాల కోసం ఎంత త్యాగం అయినా చేస్తుంది అనే వాదన చాల రోజుల నుంచి ఉంది.
ఆమె హద్దులు దాటి నటించదు కాబట్టి కొంత మేర హీరోలు ఆమెను తమ సినిమాలో పెట్టుకోవడానికి ఒప్పుకోరు.ఇప్పుడు హావ చూస్పిస్తున్న చాల మంది హీరోలకు ఒక హీరోయిన్ నుంచి ఏం కావాలో అందరికి బాగా తెలుసు.
అది సాయి పల్లవి తో కుదరదు కాబట్టి ఒక పోర్షన్ ఆఫ్ హీరోస్ ఆమెను మొదటి నుంచి పక్కన పెట్టారు.ఇక ఆమె సెకండ్ గ్రేడ్ హీరోలతోనే నటిస్తూ వస్తుంది లేదా విమెన్ సెంట్రిక్ సినిమాలో కనిపిస్తూ ఉంది.
అవి కూడా ఒకటి రెండు దెబ్బ కొట్టగానే ఆమెను అందరు మర్చిపోతున్నారు.
పెయిడ్ కవరేజీలు ఇచ్చి మన మీడియా తెరమరుగు అయిపోతున్న ముసలి హీరోయిన్స్ కి కూడా ఊతం ఇస్తారు కానీ అలాంటివి సాయి పల్లవి కి అవసరం లేదు కాబట్టి మీడియా కూడా ఆమెను పూర్తి స్థాయి లో మర్చిపోయింది.ఇక మొన్నటికి మొన్న కమల్ హాసన్( Kamal Haasan ) సొంత సినిమా లో హీరో గా శివ కార్తికేయన్( Shiva Karthikeyan ) హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్నారు.ఆ సినిమా ప్రారంభానికి కూడా సాయి పల్లవి వచ్చింది కానీ మీడియా లో ఆమె కు సంబందించిన హడావిడి ఎక్కడ లేదు.
ఆమె ఫోటో తీసేసి కూడా కొంత మంది ప్రసారం చేసారు.
అంతటి ఘనకీర్తి కట్టుకున్న మన మీడియా కి సాయి పల్లవి లాంటి వారిపై ఇంత నిర్దయ ఎందుకో అర్ధం కాదు.పైగా ఆమె ఏమైనా ట్యాలెంట్ లేని హీరోయిన్ కాదు.ఎక్సపోసింగ్ చేయదు, మంచి నటి, ఎవరికీ కోరికలకు ఆమె లొంగదు అనే కారణాల చేత సాయి పల్లవి ని మరో మహా నటి కాకుండా ఎవరు అడ్డుకోలేరు.
ఈ బాషా లో సినిమాలో రాకపోతే మరొక చోట పని చేస్తాను.ఎక్కడ ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఒక చిన్న హాస్పిటల్ ఐన పెట్టుకొని డాక్టర్ గా తన వృత్తి చేసుకుంటాను అని ఎప్పుడో అందరికి గూబ గుయ్యిమనేలా చెప్పింది.
అందుకే సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ గురించి ఇకనైనా ఆలోచించి ఆమె కోసం మంచి కథలు రాసి సినిమాలు చేయండి.ఆమె లాంటి వారు సినిమా ఇండస్ట్రీ కి చాల అవసరం కూడా.!
.