సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ అనేది నేడు పెనుసంచలనంగా మారింది.ఈ క్రమంలోనే దీని గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అవును, చాట్‌జీపీటీ( chatgpt ) వంటి ఏఐ చాట్‌బాట్‌లతో మానవ మనుగడకు ప్రమాదమని స్వయంగా ఐటీ రంగ నిపుణులే ఆందోళనలు వ్యక్తం చేయడం కొసమెరుపు.మరోవైపు ఏఐ చాట్‌బాట్‌ల గురించి ఎలాంటి భయాలు అవసరంలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
ఇక ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చి సంచలం సృష్టించడంతో దానికి పోటీగా గూగుల్ బార్డ్‌ను తీసుకువచ్చింది.మైక్రోసాప్ట్ ( Microsoft )మాత్రం చాట్‌జీపీటీ సేవలను బింగ్‌లో అందిస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఇటీవలే బింగ్‌లో ఇమేజ్ జనరేషన్ సాఫ్ట్‌వేర్ DALL-E టూల్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే.
ఈ టూల్‌తో యూజర్లు ఈమధ్య కాలంలో రక రకాల ఫొటోలను డిజైన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఉదాహరణకు ఏదైనా విహారయాత్రకు వెళ్లకుండానే.ఈ టూల్‌తో అక్కడికి వెళ్లినట్లు ఫొటోను డిజైన్ చేసి మరీ పోస్టు చేస్తున్నారు.
అలా, ఒక ఏఐ ఆర్టిస్ట్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) నవ్వుతూ హోలీ వేడుకల్లో పాల్గొన్నట్లు ఫొటోను డిజైన్ చేశాడు.అదికాస్తా ఆనంద్ మహీంద్రాకు చేరువకావడంతో ఆయన దాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఏఐతో భవిష్యత్తు భయానకంగా ఉండబోతుందని ట్వీట్ చేశారు.
అవును, అయన ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ… ”ఈ ఏఐ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు కానీ, హోలీ సంబరాల్లో( occasion of Holi ) నేను ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు డిజైజ్ చేశాడు.కానీ నిజానికి నేను ఎప్పుడూ అలా హోలీ జరుపుకోలేదు.అలానే.నాకు ఇష్టమైన కొన్ని పర్యాటక ప్రదేశాలకు నేను వెళ్లినట్లు కొన్ని జ్ఞాపకాలను సృష్టించమని నేను అతన్ని ఈ సందర్భంగా అడుగుతున్నా.వాస్తవానికి నేను అక్కడికి వెళ్లకపోయినా.కనీసం నేను అక్కడికి వెళ్లాననే తృప్తి నాకు ఉంటుంది.
అయితే, ఏఐతో ఎంతో సులువుగా నకిలీ ఫొటోల డిజైన్ చేయడంతోపాటు నకిలీ వార్తలను సృష్టించవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది.భవిష్యత్తు ఇంకా భయానకంగా మారబోతోందన్నమాట!” అంటూ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కొందరు ఏఐకి మద్దతుగా, మరికొందరు ఏఐకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.