పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’( Adipurush movie ).ఈ సినిమా మ్యానియా ఇప్పుడు బాక్సాఫీస్ ను ఊపేస్తోంది.
ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ”ప్రాజెక్ట్ కే”( Project K movie ) ఒకటి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.
ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేశారు.అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.అలాగే ఒక వైపు షూట్ పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలం లోనే పూర్తి చేస్తున్నారు.
ఇలా నాగ్ అశ్విన్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కష్ట పడుతున్నారు.
ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయిన విషయం విదితమే.
వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు ఈయన గురించి మరో వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
కమల్ హాసన్ ఈ సినిమాకు ఆగస్టులో డేట్స్ కేటాయించారని టాక్.
తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేందుకు ఆగస్టులో డేట్స్ ఇచ్చారని అంతా అప్పుడే షూట్ పూర్తి చేయనున్నారని ఇప్పుడు క్రేజీ బజ్ వినిపిస్తుంది.మరి కమల్ హాసన్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా.ఎలా నాగ్ అశ్విన్ ఈయన రోల్ ను చూపిస్తారా అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా.అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.