రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో అకాల వర్షాలతో నష్ట పోయిన పంటలను ఏఈఓ గంగ తో కలిసి పరిశీలించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.
పి సుదగోని శ్రీనాథ్ గౌడ్.ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు నష్ట పోయారని అన్నారు రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
అనంతరం అధికారులతో కలిసి నష్ట పోయిన పంటలను పరిశీలించారు నష్ట పోయిన పంట వివరాలను ప్రభుత్వానికి త్వరగా పంపాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని పద్మ పర్షరాం వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి, దురుముట్ల శ్రీనివాస్ , ఏఈఓ గంగ , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు భూపతి రెడ్డి , అధికారులు , రైతులు పాల్గొన్నారు