రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజల్లా గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిలోరి కళ్యాణం ఆదివారం కన్నుల పండగ జరిగింది .బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం ఉదయం గణపతి పూజ స్వస్తివాచనం ఋత్విగ్వరణం , పంచగవ్య ప్రాశనం అంకురార్పణ ధ్వజారోహణ , సర్వతో భద్ర స్థాపనం, అగ్ని ప్రతిష్ట, స్థాపితా దేవాత హవనం, మంత్రపుష్పం మంగళహారతి , అఖండ దీపారాధన , శని వారం నవగ్రహ పంచసూక్త హవనం, కుంకుమార్చన అనంతరం స్వామి లోరిని ఎంతో వైభవంగా ఎదురుకున్నారు రాజోపచారములు నిర్వహించారు.
ఆదివారం గరుడ సేవ నిర్వహించారు.
పూర్ణహుతి అనంతరం శ్రీ వేణుగోపాల స్వామికి కన్నుల పండువగా కళ్యాణం నిర్వహించారు సాయంత్రం రథోత్సవాన్ని గ్రామ పురోహితులు రాచర్ల విద్యాసాగర్ శర్మ , బుగ్గ వాసు దేవ శర్మ గారి ఆద్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ శివరామకృష్ణ భజన మండలి నిర్వహించారు.శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, స్థానిక సర్పంచ్ పాశం సరోజన దేవా రెడ్డి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , ఎంపిటీసీ సభ్యులు శ్రీ నివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, కొండ రమేష్ గౌడ్ బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కొండ ఆంజనేయులు గౌడ్ , మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.