అమెరికా అధ్యక్షుడు బిడెన్ కు ప్రస్తుతం జరగుతున్న మధ్యంతర ఎన్నికల్లో భంగపాటు తప్పేలా లేదని తెలుస్తోంది.అమెరికా ఎన్నికల సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండేళ్ళకు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ ఎన్నికల ఫలితాలు తరువాత వచ్చే ప్రధాన ఎన్నికల పై ప్రభావం చూపడంతో ప్రస్తుత అధికార పార్టీకి ఈ మధ్యంతర ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమనే చెప్పాలి.అయితే అందరూ ఊహించినట్టుగానే.
మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతోంది.అత్యంత కీలకమైన ప్రతినిధుల సభ పై రిపబ్లికన్ ను పట్టు సాధిస్తారని సర్వేలు, విశ్లేషకులు సైతం బలంగా చెప్తున్నారు.
చాలా చోట్ల రిపబ్లిక్స్ కు సీట్లు దక్కుతున్నాయని తెలియడంతో ప్రతినిధుల సభ ఎక్కడ చే జారిపోతుందోనని డెమోక్రాటిక్ పార్టీలో అందోళన నెలకొంది.ఇదే గనుకా జరిగితే ప్రతినిధుల సభ ఆధిపత్యం రిపబ్లికన్స్ కు దక్కి అధ్యక్షుడు బిడెన్ తీసుకునే నిర్ణయాలకు రిపబ్లికన్స్ మద్దతు అవసరం అవుతుంది.
బిడెన్ తన అజెండా అమలులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అమెరికాలోని మిగలిన రాష్టాలైన పెన్సిల్వేనియా, జార్జియా, ఆరిజోనా రాష్ట్రాలలో పోటీ ఎంతో ఆసక్తిగా ఉంటుందని, ఇక్కడ హోరా హరీ పోటీ జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.ప్రస్తుతం ఈ ఎన్నికల్లో 46 ,మిలియన్స్ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారట.ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు గాను సెనేట్ లో మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
అమెరికా ఆనవాయితీ ప్రకారం సహజంగా మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ ఎప్పుడూ విజయం సాధించదు అయితే అబార్షన్స్ పై మహిళా లోకానికి తాము మద్దతుగా నిలిచామని తప్పనిసరిగా తాము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని డెమోక్రాటిక్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.కానీ అమెరికాలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం కారణంగా అధికార పార్టీ కి ప్రజల మద్దతు తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.