ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
అందుకే ఈ సినిమాలో తీసుకునే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.తాజాగా మరొక సీనియర్ హీరోయిన్ కు ఈయన అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి చాలా మందికి తెలుసు.ఈ మధ్య పలు షోలకు జడ్జ్ గా వస్తూ ఈమె మరింత పాపులర్ అయ్యింది.
ఇంద్రజ టాప్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యింది.అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా వరుస అవకాశాలు అందుకుంటూ జోరు చూపిస్తుంది.
తాజాగా ఈమెకు పుష్ప 2లో అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.పుష్ప 2 లో ఒక కీలక పాత్ర కోసం ఈమెను సుకుమార్ సంప్రదించారట.ఇదే కనుక నిజం అయితే ఈమె పేరు మారుమోగి పోవడం ఖాయం.ఏకంగా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.