టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ కు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎంతోమంది సెలబ్రిటీలకు ఎన్టీఆర్ ఒక హాట్ ఫేవరెట్ అని చెప్పవచ్చు.సీనియర్ హీరోయిన్లు అయినా ఖుష్బూ, వనిత విజయ్ కుమార్ లాంటి వారికి కూడా ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కు బుల్లితెరపై, వెండితెరపై బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.
ఇంకా ఖుష్బూ అయితే ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమాభిమానాన్ని పబ్లిక్ గా నిర్మోహమాటంగా బయట పెట్టేసింది.
ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చినా చాలని, అలాగే ఒక్క షాట్ లో నటించిన పర్వాలేదని వార్త వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది.తాజాగా గృహలక్ష్మి కస్తూరి శంకర్ కూడా ఎన్టీఆర్ పై కామెంట్ చేసింది.
స్టార్ మాలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది కస్తూరి శంకర్.తెరపై తెలుగింటి ఆడపడుచులాగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము లేపుతుంది.
తన హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఉంటుంది.సీరియల్ లో కనిపించే కస్తూరి శంకర్ ఫోటోలు సోషల్ మీడియాలో కస్తూరి శంకర్ ఫోటోలు చూసినవారు ఆశ్చర్య పోతూ ఉంటారు.ఇద్దరూ ఒకటేనా అనే విధంగా ఈమె తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పై ప్రేమను చాటుకుంది కస్తూరి శంకర్.ఏపీలో వరదలు ఏ రేంజిలో భీభత్సాన్ని సృష్టించాయో మనందరికీ తెలిసిందే.ఏపీ వరద బాధితులకు సహాయం అందించడానికి 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్.
అలాంటి వ్యక్తికి అభిమానిని అయినందుకు గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.