1.ఢిల్లీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ అనుమానితులు

ఢిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది ఒమీ క్రాన్ అనుమానితులు ఉన్నారు.
2.జగ్గారెడ్డి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది.దానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎంపీటీసీలు, జడ్పిటీసీ లను అనేక ప్రలోభాలకు గురి చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
3.హైదరాబాద్ కు 20 న రానున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 20 న హైదరాబాద్ కు రానున్నారు.శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి రానున్నారు.
4.భారత్ లో 40 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్
భారత్ లో 40 ఏళ్లు దాటిన వారు అందరికీ బూస్టర్ డోస్ భారత్ లో 40 ఏళ్లు దాటిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఇండియన్ జీనోమ్ సైంటిస్ట్ కు సిఫార్సు చేశారు.
5.కేసీఆర్ పై షర్మిల విమర్శలు

యాసంగి వడ్ల కొనుగోలు పై రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే పది మంది రైతుల గుండెలు ఆగిపోయాయని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
6.తెలంగాణలో ఒమైక్రాన్ టెన్షన్

తెలంగాణ లో ఓమైక్రాన్ టెన్షన్ పెరిగిపోతోంది.బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పదిమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
7.ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.గంటకు 30 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కొనసాగుతోంది.
8.రేపు ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు

రేపు ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
9.నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4143 సీట్ల భర్తీ
ఏపీ లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు త్రిబుల్ ఐటీ ల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ ముగిసింది.
10.టీడీపీ నేతలపై పోలీసులకు కేసులు
వన్ టైమ్ సెటిల్మెంట్ లబ్దిదారుల తో సమావేశం నిర్వహించిన కాకినాడ తెలుగుదేశం పార్టీ లీడర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
11.పి ఆర్ సి పై జగన్ గుడ్ న్యూస్

పిఆర్సి పై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలకు జగన్ న్యూస్ చెప్పారు.తిరుపతి లో కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన జగన్ పిఆర్సి ప్రక్రియ పూర్తయిందని, మరో పది రోజుల్లో దీనిపై ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు.
12.జగన్ పై లోకేష్ విమర్శలు
ఏపీ సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారా లేక సెల్ఫీ దిగేందుకు వెళ్లారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
13.పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు.
14.33వ రోజుకు చేరుకున్న మహా పాదయాత్ర
రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని కోరుతూ రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 30 మూడో రోజుకు చేరుకుంది.
15.ఆదిలాబాద్ లో తెలంగాణ సీఎస్ పర్యటన

ఆదిలాబాద్ లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ పర్యటించారు. కరోనా వ్యాక్సినేషన్, ఓమి క్రాన్ అప్రమత్తత పై సమీక్ష నిర్వహించారు.
16.ధాన్యం కొనుగోలు పై కేంద్రం ప్రకటన
దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సమాధానం చెప్పాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు పట్టుపట్టడంతో కేంద్రం మంత్రి పియూష్ గోయల్ స్పందించారు.ధాన్యం కొనుగోళ్లపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని , ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగి లో ధాన్యం కొనుగోలు పై ఆలోచిస్తామని ఆయన ప్రకటించారు.
17.ఓమి క్రాన్ పై ఆందోళన వద్దు

ఒమి క్రాన్ వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
18.హైదరాబాదులో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్ నగరంలో శుక్రవారం కొత్తగా 32 బస్తీ దావాఖాన లు ప్రారంభమయ్యాయి.
19.ప్రశాంత్ కిషోర్ పై సల్మాన్ ఖుర్షీద్ మండిపాటు

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,450
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,490