ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ఈ విషయంలో నిర్ణయించిన ధరల పట్ల టాలీవుడ్ దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు పలువురు సినీ సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ ఇండస్ట్రీ పై వేసిన అస్త్రాలకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తాజాగా ఈ విషయం పట్ల టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు.తన తరపున ఏపీ ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు.
సినీ ఇండస్ట్రీలో 45 సంవత్సరాలుగా దర్శకుడిగా, నిర్మాతగా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి మనం ఎప్పుడూ మూలాలని మర్చిపోకూడదు.నేను ఇవాళ ఈ పొజిషన్ లో ఉండటానికి గల కారణం ప్రేక్షకులు అలాగే థియేటర్ యాజమాన్యం డిస్ట్రిబ్యూటర్లు,నిర్మాతలు.
వీరందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది.సాధారణ వ్యక్తులకు ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక్కటే.ఒక అద్భుతమైన కథ, హృదయానికి హత్తుకునే కదా, మంచి మంచి పాటలు, సరదాగా చూసే సినిమా థియేటర్లో చూసిన అనుభూతి, టీవీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అని అతను తెలిపారు.షోస్ తగ్గించడం వల్ల, టికెట్ ధర తగ్గించడం వల్ల పైన చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోతారు.
ఒక హిట్ సినిమా ఎక్కువ షోస్ వేసుకున్నా మొదటి వారం రేట్స్ పెంచుకోవడం వలన, తర్వాత కొన్ని మామూలు సినిమాలు వచ్చినా థియేటర్ల యాజమాన్యం, వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి రెండు మూడు నెలలకి సరిపడ ఆదాయం.ఎందుకంటే వంద సినిమాలలో పది శాతం హిట్స్ కన్నా ఉండవు.
పది శాతం యావరేజ్.ఇది అందరికీ తెలిసిన సత్యం.
అని ఆయన తెలిపారు.
అలాగే ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమా చూడాలి అనుకుంటే టికెట్ ధర ఎంత అయినా పెడతారు.ప్రేక్షకులకు నచ్చిన సినిమాను ఒక రూపాయికే చూపిస్తాను అన్న వారు చూడరు.అలాగే టికెట్లను ఆన్లైన్ లో అమ్మితే థియేటర్ వల్ల గవర్నమెంట్ కి ఎక్కువ టాక్స్ వస్తుంది.
కనుక ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని నేను ఆశిస్తున్నాను అంటూ రాఘవేంద్ర రావు తెలిపారు.ఆన్ లైన్ వలన దోపిడి ఆగిపోతుందని అనడం కరెక్ట్ కాదు.
ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ వెల మూడొందలైనా, ఐదొందలు అయినా కూడా చూస్తాడు.అంటూ టికెట్ల విషయంపై రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు.