నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘అఖండ’.ఈ సినిమా మే లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూట్ వాయిదా పడడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు మన ముందుకు వస్తుంది అఖండ.చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వస్తుంది.
అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
ఇక నందమూరి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక్కడ ఈ రోజు సినిమా విడుదల అవుతుండగా ఓవర్శిస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తారన్నా విషయం తెలిసిందే.ఇక అక్కడ ప్రీమియర్స్ చుసిన ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఇది కదా బాలయ్య సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే ట్విట్టర్ లో ఈ సినిమా రివ్యూ కూడా వచ్చేసింది.ఇక ఇప్పుడు అమెరికాలోని డల్లాస్ లో బాలయ్య అభిమానుల సందడి అంత ఇంత కాదు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది.డల్లాస్ లో అఖండ ప్రీమియర్ చుసిన అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.అభిమానులంతా ప్రీమియర్ చూసిన తర్వాత బాలయ్య మీద అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఏకంగా కార్ ర్యాలీ చేసారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడం నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.మంచి మాస్ కథ పడితే బాలయ్య స్టామినా ఇప్పటికి కూడా తగ్గలేదు అని ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది.