అదృష్టం ఏ వైపు నుండి వచ్చి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు.కొన్ని సార్లు కొన్నిటిని మనం పోగొట్టుకోవడం వల్ల కూడా మనకి అదృష్టం కలిసొచ్చి పోగొట్టుకున్న దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువగా తిరుగి వస్తుంది.
అలాంటి సంఘటనే ఒకటి లండన్ లో జరిగింది.దొంగిలించిన డెబిట్ కార్డ్ తో లాటరీ తీసిన దొంగలకు 4 మిలియన్ యూరో ల లాటరీ తగిలింది , దానితో సంతోష పడ్డ దొంగల కి అక్కడి పోలీస్ లు షాక్ ఇచ్చారు.
అసలు విషయానికి వస్తే…
లండన్ కి చెందిన మార్క్ గూడ్రమ్ ,జాన్ రాస్ వాట్సన్ లు చిన్న చినం దొంగతనాలు చేస్తూ జీవనాన్ని సాగించేవారు.విలాసాలకు అలవాటు పడ్డ వీరు డబ్బున్న వారి దగ్గర క్రెడిట్ కార్డ్ లు డెబిట్ కార్డ్ లు దొంగిలించి వాటిని వారికి కావాల్సిన దానికోసం ఖర్చు చేసేవారు.
ఒకరోజు ఒకతని దగ్గర వీరిద్దరూ కలిసి ఒక డెబిట్ కార్డ్ ని దొంగిలించారు.అందులో ఉనయోగించి అందులో మిగిలిన పది పౌండ్లు పెట్టి లోటో కంపెనీ వారి లాటరీ స్క్రాచ్ కార్డ్ కొన్నారు , ఆ స్క్రాచ్ కార్డ్ గీకి చూస్తే ఒక్కసారిగా తగిన మత్తు అంత దిగిపోయింది ఎందుకంటే వారికి ఏకంగా గా 4 మిలియన్ పౌండ్ల లాటరీ తగిలింది.
అంటే మన దేశ కరెన్సీ లో దాదాపు 36 కోట్లు అంత మొత్తాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు.వెంటనే లాటరీ కంపెనీ దగ్గరికి వెళ్లారు ఆ ఇద్దరు దొంగలు , తమ లాటరీ టికెట్ ని కంపెనీ కి చూపించారు.
వారు చూపించిన టికెట్ ని పరిశీలించిన కంపెనీ అధికారులు వారు నిజంగానే 4 మిలియన్ పౌండ్ లు గెలుచుకున్నారని తెలిపింది.దీనితో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కోసం లాటరీ కంపెనీ అధికారులు ఆ దొంగలని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగారు , దీనితో వారికి బ్యాంక్ అకౌంట్ లు లేవని డబ్బులు చేతికి ఇస్తే తీసుకుంటామని చెప్పారు.
అనుమానం వచ్చిన లాటరీ కంపెనీ అధికారులు అసలు స్క్రాచ్ కార్డ్ వారిదేనా కాదా అని అనుమానాలు వచ్చాయి.స్క్రాచ్ కార్డ్ బిల్లును ఇవ్వమని నిర్వహకులు కోరగా, సదరు జంట దొంగలు బిల్లును రశీదును తీసి ఇచ్చారు.
అయితే ఆ స్క్రాచ్ కార్డును కొన్నది డెబిట్ కార్డు ద్వారా అని గుర్తించిన నిర్వాహకులు అసలు సంగతి ఏంటా అని అక్కడి పోలీసులకు ఫిర్యదు చేశారు.పోలీసుల విచారణ వారు ఆ డెబిట్ కార్డ్ ని దొంగిలించి టికెట్ కొన్నారని తెలిసింది.ఇంకేముంది లాటరీ రూల్ ప్రకారం ఎవరి పేరిట అయితే డెబిట్ కార్డు ఉందోవారే రూ.36 కోట్ల ప్రైజ్ మనీకి హక్కుదారుడు అని తేల్చేశారు.చివరికి మార్క్ గూడ్రమ్ ,జాన్ రాస్ వాట్సన్ లు జైలు కి వెళ్లారు , అసలు డెబిట్ కార్డ్ దారుడు కోటీశ్వరుడయ్యాడు…
.