ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ ఎవరికీ రావడంలేదు.ఎందుకంటే గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ ఎలా ఉన్నా పైకి మాత్రం తామే అధికారంలోకి రాబోతున్నాము అనే ధీమాను ప్రతి పార్టీ వ్యక్తం చేస్తూ కింది స్థాయి క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తున్నాయి.
కానీ ప్రతి పార్టీకి తాము గెలుస్తామా లేదా అన్న సందేహం మాత్రం వెంటాడుతూనే ఉంది.ఇది ఇలా ఉంటే ఆయా పార్టీల నాయకులు పడే టెన్షన్ ఎలా ఉన్నా బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం చాలా బెంగ పట్టుకుంది.
ముఖ్యంగా ఈ బెట్టింగులకు కేరాఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు సైలెంట్ అయిపోయారు.పందెం రాయుళ్లంతా ఇప్పుడు ఒకటే ఆలోచనలో ఉన్నారు.
ఏ క్లారిటీ లేకుండా లక్షలాది రూపాయలు పందేలు కాసి చేతులు కాల్చుకోవడం ఎందుకు ? అని వెనకడుగు వేస్తున్నారు.మొన్నటి వరకు ఓ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంతా గట్టిగా నమ్మారు.
దీంతో అవతలి పార్టీ మీద పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలపై వేల కోట్లలో బెట్టింగ్ లు జరుగుతాయని అంతా ఆశించినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు.
దీనికి కారణం అభ్యర్ధుల గెలుపోటములపై ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.రాజకీయ పార్టీల్లో సైతం ఇదే గందరగోళం నెలకొంటోంది.
అందుకే మరోసారి సర్వేలకు కూడా సిద్ధపడుతున్నారు
బెట్టింగ్ కు ప్రధాన కేంద్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈసారి బెట్టింగ్ రాయుళ్లు గతంలో పోలిస్తే ఈసారి నెమ్మదించినట్లు తెలుస్తోంది.వీరిని చూసి ఇతర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు వెనక్కి తగ్గుతున్నారు.
మొన్నటి వరకు వైసీపీ గెలుపుపై ఏకపక్షంగా బెట్టింగ్ లకు సిద్ధపడ్డ వారంతా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది అని వైసీపీ లెక్క తేల్చడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.ప్రధానంగా నరసాపురం ఎంపీ సీటులో వైసీపీ అభ్యర్ధి కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపు ఖాయమనే వార్తలు వచ్చినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ లెక్కలు బయటకి వస్తున్నాయి.
ఇప్పటి నుంచే పందేలు కాసి చేతులు కాల్చుకోవడం కంటే కౌంటింగ్ తేదీ దగ్గరకు వచ్చిన సమయంలో పరిస్థితులను బట్టి పందేలు కాల్చుకోవడం బెటర్ అన్ని ఆలోచనలో బెట్టింగ్ బంగార్రాజులు ఉన్నారు.