తెలంగాణ రాజకీయాలలో ప్రశ్నార్ధకంగా మారిన కోదండరాం భవిష్యత్తు?

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తో కలిసి తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి రకరకాల వ్యూహాలతో తెలంగాణను సాధించడంలో కీలక పాత్రను పోషించిన ప్రొఫెసర్ కోదండరాం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.తెలంగాణ జనసమితి అనే పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేసిన తెలంగాణ జనసమితి పార్టీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

 The Future Of Kodandaram, Which Has Become Questionable In Telangana Politics  K-TeluguStop.com

అయినా రకరకాల సమస్యల మీద పోరాడుతున్న తెజస పార్టీ ఈ మధ్య సైలెంట్ గా ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేస్తుండగా ఎమ్మెల్సీగా నైనా గెలిచి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడుతున్న పరిస్థితులలో కోదండరాం ఎమ్మెల్సీగా గెలిచి ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ జనసమితికి కొంతమేర లాభం జరిగే అవకాశం ఉంది.కేసీఆర్ తో విభేదాల వల్ల కోదండరామ్ కు సరైన అవకాశాలు రాలేదు.

కేసీఆర్ కేబెనెట్ పదవిని ఆఫర్ చేసినా కూడా కోదండరామ్ తిరస్కరించడంతో కోదండరామ్ ను కేసీఆర్ పట్టించుకోలేదు.కాని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ లాంటి నేతకు సరైన ప్రాధాన్యత కలగకపోవడం కొంచెం శోచనీయమైన విషయం.

చూద్దాం కోందండరాం రాజకీయ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube