ప్రపంచం మీద చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.కొన్ని మన నోటీసుకు రావు, మరి కొన్ని మీడియా ద్వారా మన నోటీసుకు వస్తున్నాయి.
సోషల్ మీడియా పరిధి బాగా పెరిగిన కారణంగా ప్రపంచంలో జరుగుతున్న చిత్ర విచిత్రాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు మన కంటి ముందుకు వస్తున్నాయి.తాజాగా జరిగిన ఒక సంఘటన నమ్మశక్యంగా లేదు, అసలు ఇలా కూడా జరుగుతుందా అనుకుంటారు.
ఒక రామ చిలుక చేసిన పనికి పోలీసులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.బ్రెజిల్‌లో జరిగిన ఈ వింత ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…బ్రెజిల్ దేశం పియావి రాష్ట్రంలోని ముఖ్య పట్టణం విల్లా ఇర్మాడుల్సేలో డ్రగ్స్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగి పోయింది.ఈ డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కారకుడు అయిన వ్యక్తి వివరాలు తెలియడంతో పోలీసులు పెద్ద ఎత్తున అతడు ఉన్నాడు అంటూ సమాచారం అందిన ప్లేస్‌కు వెళ్లారు.
పోలీసులు అక్కడకు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న ఒక రామ చిలుక ఏదో విచిత్రమైన సౌండ్ ను రెండు సార్లు చేసి ఆ తర్వాత పోలీస్ పోలీస్ అంటూ అరవడం మొదలు పెట్టింది.దాంతో పోలీసులకు విషయం అర్థం అయ్యింది.
తమ రాకను లోపల ఉన్న మాఫియా ముఠాకు రామ చిలుక అందించిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే లోనికి పరిగెత్తుకుంటూ వెళ్లారు.అయితే అప్పటికే లోపల ఉన్న ముఠా వారు ఎక్కడివి అక్కడ వదిలేసి వెళ్లి పోయారు.
పోలీసులకు కనీసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా చిక్కలేదు.పోలీసులకు విపరీతమైన కోపం వచ్చింది.
ఎంతో కష్టపడితే ముఠాకు చెందిన సమాచారం లభించింది.కాని కష్టపడి వస్తే ఒక్కరు అంటే కనీసం ఒక్కరు కూడా లభించకుండా పోలీసులను రామచిలుక ఫూల్స్‌ను చేసింది.
రామచిలుక ముందస్తు హెచ్చరిక చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒక్కరిని అయినా గాయాలతో లేదా ఏదోలా పట్టుకునేవారు.అతడి ద్వారా పూర్తి విరాలు రాబట్టే వారు.
కాని రామ చిలుక వారి ప్రయత్నం మొత్తం నాశనం చేసింది.మాఫియాకు సాయం చేసిన కారణంగా రామ చిలుకను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాని నుండి ఏమైనా సమాచారం వస్తుందా అనే కోణంలో ఎంక్వౌరీ చేస్తున్నారు.ఆ చిలుక మరేమైనా పలుకులు కూడా నేర్చిందా అంటూ విచారిస్తున్నారు.
ఆ చిలుక మాత్రం ఏం పట్టనట్లుగా పోలీసులు పెట్టిన చిరు దాన్యాలు తింటూ బతికేస్తుంది.