Chandrababu Jagan : జగన్ నెత్తిన పాలు పోస్తున్న బాబు. ఆ తప్పులే జగన్ పార్టీకి వరం కానున్నాయా?

ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనుండగా 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంతో కష్టపడుతున్నారు.ఈ నెల 14వ తేదీన టీడీపీ రెండో జాబితా విడుదల కానుండగా ఈ నెల 16వ తేదీన వైసీపీ( YCP ) 175 ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది.

 Tdp Mistakes Plus For Ycp Details Here Goes Viral In Social Media-TeluguStop.com

రెండు పార్టీలు కొన్నిరోజుల గ్యాప్ లోనే మ్యానిఫెస్టోలలో స్వల్పంగా మార్పులు చేసి కొన్ని మ్యానిఫెస్టోలను ప్రకటించనున్నాయని తెలుస్తోంది.

అయితే టీడీపీ( TDP ) చేస్తున్న తప్పులు వైసీపీకి ప్లస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గీతాంజలి( Geethanjali ) విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో 1 శాతం కంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి( BJP ) 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇవ్వడం వల్ల టీడీపీకి నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ సీఏఏ అమలు దిశగా వేస్తున్న అడుగులు మైనార్టీల ఓట్లను టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దూరం చేసే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cmjagan, Geethanjali, Pawan Kalyan, Tdpbj

వాలంటీర్ల విషయంలో గతంలో పవన్( Pawan Kalyan ) విమర్శలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు( Chandrababu ) వాలంటీర్లకు హామీలు ఇస్తున్నా వాళ్లు వాటిని నమ్మే పరిస్థితి లేదు.గ్రాఫిక్స్ అంటూ వైసీపీ విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారం సైతం ఆ పార్టీపై విమర్శలకు తావిస్తోంది.మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

అయితే టీడీపీ మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెంచుకుంటోందని ఆ పార్టీ కార్యకర్తలే ఫీలవుతున్నారు.

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cmjagan, Geethanjali, Pawan Kalyan, Tdpbj

మెజారిటీ నియోజకవర్గాలలో ఎన్నికల ఫలితాలను న్యూట్రల్ ఓటర్లు డిసైడ్ చేస్తారు.తప్పు మీద తప్పు చేయడం ద్వారా 2019 ఓటమి నుంచి బాబు ఏం నేర్చుకున్నారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.2014లో పొత్తుల వల్ల మేలు పొందిన టీడీపీకి ఇప్పుడు అవే పొత్తుల వల్ల ఊహించని స్థాయిలో నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.వైసీపీపై విమర్శలు చేయడం కంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో టీడీపీ చెబితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube