ఇంట్లో నిధులు ఉన్నాయని నమ్మించి... నగ్నపూజలకు ఒప్పించి.. ఆ దొంగ బాబా ఏం చేసాడంటే..?   Treasures In The House Thief Baba Convinced The Naked Popes?     2018-10-08   15:00:46  IST  Sai M

జనం మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకుంటున్నారు నకిలీ బాబాలు. అవసరాల కోసం మితిమీరిన విశ్వాసాలను ఒంటబట్టించుకుని నకీలీ స్వాముల లీలల ముందు బోల్తా పడుతున్నారు చాలామంది. ఇటువంటి సంఘటనలు గురించి నిత్యం అనేక వార్తలు వస్తున్నా జనంలో మాత్రం మార్పు రాకపోవడంతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటువంటి సంఘటనలకు ఉదాహరణగా ఈ కింది సంఘటన నిలుస్తోంది.

అనంతపురం జిల్లా మాధవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి తరచూ పాము వచ్చేది. పామిడికి చెందిన స్వామీజీని కలిసి పాము వస్తున్న విషయాన్ని వివరించింది. స్వామీజీ వచ్చి ఇంటిని పరిశీలించి, ఆమె బలహీనతను ఆసరా చేసుకుని మీ ఇంట్లో నిధి ఉంది. అందుకే పాము వస్తుంది. రాకుండా ఉండాలంటే అర్థరాత్రి నగ్నంగా పూజలు చేయాలి. అందుకు 30వేలు ఖర్చవుతుందని ఆమెని ఒప్పించాడు. డబ్బు తీసుకుని పూజలు చేసాడు. అయినా పాము రావడం ఆగలేదు. నిధి కూడా దొరకలేదు. ఆరు నెలలుగా ఎదురు చూసిన మహిళ స్వామి చేతిలో మోసపోయానని ఆలస్యంగా తెలుసుకుంది. గ్రామస్తుల సహాయంతో అతడికి దేహశుద్ధి చేసింది. చొక్కా విప్పి నీ పరువు బజారుకు ఈడుస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది.