ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అని అనిపించక మానదు.దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు కీచకులు చేసేటటువంటి ఆకృత్యాలకు పసిపిల్లల జీవితాలు ఆదిలోనే బుగ్గి పాలు అవుతున్నాయి.
తాజాగా పాల ప్యాకెట్ కొనడం కోసం ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి నుంచి బయటకు వచ్చి ముగ్గురు మృగాళ్లు లాంటి ముగ్గురు మైనర్ బాలుల చేతిలో దారుణంగా అత్యాచారానికి గురైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణ పరిసర ప్రాంతంలో 8 సంవత్సరాల కలిగినటువంటి ఓ చిన్నారి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.
ఈ చిన్నారి తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.నిన్నటి రోజున చిన్నారిని తమ దగ్గరలో ఉన్నటువంటి కిరాణా దుకాణంలో పాల ప్యాకెట్ తీసుకు రమ్మని బయటకు పంపించారు.
దీంతో స్థానికంగా ఉన్నటువంటి మరో మైనర్ బాలుడు బాలిక పై కన్నేశాడు.అయితే పాల ప్యాకెట్ కోసం చిన్నారి ఒంటరిగా బయటికి రావడంతో ఇదే అదనుగా చూసుకున్న కీచక బాలుడు చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని పక్కకు తీసుకెళ్లగా అప్పటికే అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలుడు స్నేహితులు కలిసి చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలిక దేహాన్ని గుర్తించినటువంటి స్థానికులు వెంటనే చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.దీంతో చిన్నారి తల్లిదండ్రులు వైద్య చికిత్సల నిమిత్తమై ఆమెని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లిన అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి చిన్నారిపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.