భారత పౌరసత్వం వదులుకుంటున్న ఎన్ఆర్ఐలు.. ఐదేళ్లలో ఎంత మందో తెలుసా, ఎందుకిలా..!

గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 6 లక్షల మందికిపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటన చేశారు.

 Over 6 Lakh Indians Gave Up Citizenship In Last 5 Years, Says Mha , Citizenship,-TeluguStop.com

దీని ప్రకారం 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని విడిచిపెట్టారని నిత్యానందరాయ్ తెలిపారు.అలాగే విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.1,33,83,718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు.

అయితే ఇదే ఐదేళ్ల కాలంలోనే 10,645 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని నిత్యానంద రాయ్ వెల్లడించారు.వారిలో 4,177 మందికి పౌరసత్వం లభించిందని మంత్రి చెప్పారు.2016లో 1,106 మంది, 2017లో 817 మంది, 2018లో 628 మంది, 2019లో 987 మంది, 2020లో 639 మందికి భారతీయ పౌరసత్వం దక్కినట్లు తెలిపారు.అమెరికా నుంచి 227 మంది, పాకిస్థాన్ నుంచి 7,782 మంది అఫ్గానిస్థాన్ నుంచి 795 మంది, బంగ్లాదేశ్‌ నుంచి 184 మంది మనదేశ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు నిత్యానంద రాయ్ చెప్పారు.

2019లో అత్యధిక మంది ప్రజలు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకోగా..2020లో అత్యల్పంగా వున్నారని కేంద్ర మంత్రి చెప్పారు.కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కాలంలో తగ్గుదల నమోదయ్యిందని అయితే.ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేత, ఆంక్షల సడలింపుల కారణంగా ఈ ఏడాది తమ పౌరసత్వం వదులుకునే భారతీయుల సంఖ్య పెరిగే అవకాశం వుందని నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.

Telugu Bangladesh, Citizenship, Indiansgave, Mha, Surrenderindian-Telugu NRI

భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారత సంతతికి చెందిన వ్యక్తులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి వుండేందుకు కేంద్రం అనుమతించదు.అలాంటి వ్యక్తి.భారతీయ పాస్‌పోర్ట్‌ని కలిగి వుండి.ఆపై వేరే దేశానికి చెందిన పాస్‌పోర్ట్‌ను పొందినట్లయితే, వారు ఇతర దేశపు జాతీయతను పొందిన వెంటనే వారి భారతీయ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది.

చాలా మంది భారతీయులు ఇతర దేశాల పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి పొందే సదుపాయాలను దృష్టిలో వుంచుకుని తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.ప్రపంచ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం… పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్‌లో భారతదేశం 69వ స్థానంలో ఉంది.

ఇదే సమయంలో ఆస్ట్రేలియా 3వ స్థానంలో, అమెరికా 5వ స్థానంలో, సింగపూర్ 6వ స్థానంలో , కెనడా 7వ స్థానంలో ఉన్నాయి.అగ్రస్థానంలో యూఏఈ నంబర్ 1, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube