బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హృతిక్ రోషన్ ఎంత ఫిట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.
అయితే చాలామంది హీరోహీరోయిన్లు వారి శరీర ఫిట్నెస్ కోసం ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు.అదే విధంగా శరీర వ్యాయామాలతో పాటు సరైన డైట్ ఫాలో అవుతూ ఉండటం వల్ల వారి అందం మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది.
ఇలా హృతిక్ రోషన్ కూడా ఎన్నో శరీర వ్యాయామాలతో పాటు డైట్ కూడా ఫాలో అవుతానని ఒక సందర్భంలో వెల్లడించారు.
అయితే తన డైట్ సమయానికి అనుగుణంగా మారుస్తూ ఉంటానని ప్రతి మూడు గంటలకు ఒకసారి భోజనం చేస్తానని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తన సీక్రెట్స్ బయట పెట్టారు.
అలాగే తన డైట్ లో భాగంగా నెయ్యి తప్పనిసరిగా ఉంటుందని ఆయన వెల్లడించారు.నెయ్యి తినడం అంటే తనకు చాలా ఇష్టమని అందుకోసమే ఎక్కువగా తింటానని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తెలిపారు.