దారుణం : నాలుగు మార్కులు ఎక్కువ వేసి స్టూడెంట్ ని గర్భవతిని చేసిన టీచర్...

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తమ కూతురు వయసున్న అభం, శుభం తెలియని మైనర్ బాలికల జీవితాలను మొగ్గ లోనే చిదిమేస్తున్నారు.తాజాగా ఓ కీచక ఉపాధ్యాయుడు తన కూతురు వయస్సున్నటువంటి ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లొంగతీసుకుని ఏకంగా ఆమెను లేవదీసుకెళ్లి గర్భవతిని చేసి వదిలేసిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Minor Girl, Pregnant, Jharkhand, School Teacher, Crime News-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో ఓ బాలిక స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో చదువుకుంటోంది.అయితే ఈ బాలిక చదువుతున్న  పాఠశాలలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

అయితే కీచక ఉపాధ్యాయుడు ఎన్నో రోజుల నుంచి బాలిక పై కన్నేశాడు. దీంతో బాలికకు పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానని ఆశ చూపించి మాయ మాటలు చెప్పి ఆమెను ప్రేమలోకి దింపాడు.

దీంతో ఉపాధ్యాయుడు మాటలు నమ్మిన బాలిక అతడితో కొద్దిరోజులు ప్రేమాయణం సాగించింది.దీంతో ఇద్దరూ కలిసి పరారయ్యారు.ఈ క్రమంలో బాలిక తన ఇంటి నుంచి బంగారం మరియు నగదును తీసుకొచ్చి ఉపాధ్యాయుడికి అప్పగించింది.అయితే తన మోజు తీరిపోయిన తర్వాత కీచక ఉపాధ్యాయుడు బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు.

దీంతో బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెబితే ఏం చేస్తారో అని భయపడుతూ తనలో తానే మధన పడుతూ బిక్కు బిక్కుమంటూ జీవితం గడుపుతూ ఉండేది.ఇదంతా గమనించిన బాలిక నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు.

 సమాచారం అందుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని తన తల్లిదండ్రులకు అప్పగించారు.అయితే అప్పటికే బాలిక గర్భం  దాల్చింది.

దీంతో ఒక్కసారిగా బాలిక తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోయారు.

అంతేగాక ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన కూతురు వయసున్న బాలికను లొంగదీసుకొని గర్భవతి చేసినటువంటి ఆ కీచక ఉపాధ్యాయుడుని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube