అందువల్లే నా భార్యతో విడిపోయానంటున్న టాలీవుడ్ ప్రముఖ విలన్...

టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనటువంటి నటుల్లో సంపత్ రాజ్ ఒకరు.ఈయన దాదాపుగా టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ మరియు ఎమోషనల్ పాత్రలకు సంబంధించినటువంటి పాత్రల్లో నటించారు.

 Samapath Raj, Divorce News, Tollywood, Villain, Samapath Raj Real Life News, Sa-TeluguStop.com

సంపత్ రాజ్ అంటే అందరికీ ముందుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి చిత్రంలో “నువ్వు చెప్పినటువంటి మగతనం నేను ట్రై చేస్తా…. నేను చెప్పిన మగతనం ట్రై చేస్తావా అంటూ చెప్పే డైలాగులు ఇప్పటికి అందరికీ బాగానే గుర్తుంటాయి.

అయితే తాజా గా సంపత్ రాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తన  జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా తాను 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన భార్యని పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. తన భార్యని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెకి సరిగ్గా 19 ఏళ్ళు ఉన్నాయని అందువల్ల కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి అభిప్రాయాలు మరియు లక్ష్యాలు వేరువేరుగా ఉండటంతో ఒకానొక దశలో విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నానని తెలిపారు.

ఇందులో భాగంగానే ప్రస్తుతం విడాకులు తీసుకొని ఇద్దరు వేరువేరుగా ఉంటున్నామని, కానీ తన కూతురు బాధ్యతను మాత్రం తానే తీసుకున్నట్లు సంపత్ రాజ్ చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు కానీ విభేదాలు లేవని ఇప్పటికీ నా కూతురు వాళ్ళ అమ్మని తరచూ కలవడానికి వెళ్తుందని తాను కూడా అప్పుడప్పుడు తన మాజీ భార్య యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటానని తెలిపాడు.

అయితే ప్రస్తుతం కన్నడ, తమిళం, తెలుగు భాషలకి సంబంధించిన చిత్రాల్లో నటిస్తున్నానని అంతేగాక తాను నటించినటువంటి మరికొన్ని చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube