కిడ్నీ స్టోన్స్(మూత్రపిండాల్లో రాళ్లు).నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాలు ఉన్నాయి.అయితే మూత్రపిండాలలో రాళ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ముఖ్యంగా కొందరిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి.
వైద్యచికిత్స ద్వారా వీటిని తొలగించినా.పదే పదే తయారయ్యే రాళ్ల వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అయితే వైద్యచికిత్స లేకుండా.కొన్ని టిప్స్ పాటించి కూడా కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే.
మొదట నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి.
అలాగే తులసి ఆకులు కిడ్నీలో రాళ్లను సమర్థవంతంగా కరిగించగలవు.ప్రతి రోజు ఒక గుప్పెడు తులసి ఆకుల తీసుకుని.
వాటి నుంచి రసం తీయాలి.
ఆ రసంలో కొద్దిగా స్వచ్ఛమైన తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.
ఇలా క్రమంగా చేయడం వల్ల ఖచ్చితంగా మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తప్పకుండా కిడ్నీ బీన్స్ డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే.మూత్రపిండాల్లో రాళ్లను ఎదుర్కోవడంలో కిడ్నీ బీన్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.
ఇక ప్రతి రోజు భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిపి తీసుకున్నా కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
అలాగే కిడ్నీలో రాళ్లను సులభంగా కరిగించే శక్తి దానిమ్మకు ఉంది.
అందుకే దానిమ్మ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.మూత్రిపిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇక వీటితో పాటు డైట్‌లో ఖర్జూరం, ద్రాక్ష, యాపిల్, బ్రౌన్ రైస్, నిమ్మ, ఓట్స్ ఇలా పోషకాహారం మరియు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.తద్వారా కిడ్నీలో రాళ్లు సులభంగా కరుగుతాయి.