లేడి కమెడియన్ అందంపై మహేష్ బాబు కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే.తన లుక్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుని అభిమాన హీరో గా నిలిచాడు.

 Mahesh Babus Comments On Lady Comedians Beauty Viral On Social Media , Mahesh Ba-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

తొలిసారిగా ఇండస్ట్రీకి బాల నటుడుగా పరిచయమై చిన్న వయసులోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్.చిన్నవయసులోనే ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు.ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో తన నటనతో ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.

అలా యువరాజు, వంశీ, మురారి, పోకిరి, అర్జున్ వంటి ఎన్నో సినిమాలు మహేష్ బాబు కు మంచి గుర్తింపును అందించాయి.ఎక్కువగా క్లాస్ సినిమాలకే మంచి ప్రాధాన్యం ఇస్తాడు మహేష్ బాబు.

ఇక కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ గా కూడా బాధ్యతలు వహించాడు.మహేష్ బాబు నటుడుగానే కాకుండా వ్యక్తిగతం పట్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఈయనకు సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది.ఇక మహేష్ బాబు తనతో కలిసి నటించిన నటి నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.నమ్రత మాజీ మిస్ ఇండియా గా కూడా నిలిచింది.ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.మహేష్ బాబు సినిమా విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.

కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

ఇదంతా పక్కన పెడితే.

మహేష్ తాజాగా బాబు జీ తెలుగు తో డాన్స్ ఇండియా డాన్స్ అని షో కు తన కూతురు సితారతో వచ్చిన సంగతి తెలిసింది.ఇక ఈ షోను మహేష్ బాబు ప్రమోట్ చేశాడు.

ఇక అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ చేసిన వాళ్లకు తండ్రి తో పాటు కూతురు కూడా తెగ మార్కులు ఇచ్చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా లేడీ కమెడియన్ రోహిణి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకుంది.

అందులో తనను మహేష్ బాబు పూరి అని పిలవగా ఆ పిలుపుతోనే తెగ మెలికలు తిరిగింది రోహిణి.ఇక మహేష్ బాబు తనను అందంగా ఉన్నావని పొగటంతో తెగ మురిసిపోయింది.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వటంతో.ఈ వీడియోకి తెగ లైకులతో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.

ఎవరైనా మహేష్ బాబు అందాన్ని పొగడాలి కానీ నీ అందాన్ని మహేష్ బాబు పొగిడాడు అంటూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇక మహేష్ బాబు బుల్లితెరపై బాగానే సందడి చేసినట్లు కనిపించింది.

పైగా ఆయన అందరితో ఇట్టాగే కలిసిపోయి తన మాటలతో మరింత సందడి చేశాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube