తెలంగాణలో ప్రస్తుతం అధికార బిఆర్‌ఎస్ పార్టీని డిల్లీ లిక్కర్ స్కామ్ వెంటాడుతోంది.గత కొన్నాళ్లుగా డిల్లీ లిక్కర్ స్కామ్ లో సిఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితా పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఆ మద్య ఒక దఫా కవితను విచారించిన ఈడీ.మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.విచారణకు సహకరిస్తానని కూడా కవితా చెప్పుకొచ్చారు.అయితే విచారణ అనంతరం కవితా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఒకవేళ కవితా అరెస్ట్ అయితే తరువాత ఏం చేయాలనే దానిపై సిఎం కేసిఆర్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే కవితా అరెస్ట్ అయితే.బిఆర్‌ఎస్ పై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది.దీంతో కవితా అరెస్ట్ ను అనుకూలంగా మరుచుకునేందుకు కేసిఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.కవితకు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీచేయడం.10న కేసిఆర్ ఉన్నపాటుగా అత్యవసరంగా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే.కేసిఆర్ ఏదో మాస్టర్ ప్లాన్ రెడీ చేసేందుకు సిద్దమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ కవితా అరెస్ట్ అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే కవితా అరెస్ట్ అయితే ప్రజల్లో ప్రజల్లో సానుబుతి పెరుగుతుందని, ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే సానుభూతి బిఆర్‌ఎస్ కు కలిసొస్తుందని కేసిఆర్ భావిస్తున్నారట.
దాంతో ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
నిజానికి గత కొన్నిరోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తూనే ఉంది.ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చింది.అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ కవితాకు మరోసారి ఈడీ నోటీసులు జారీచేయడంతో ముందస్తు ఎన్నికలే సరైన వ్యూహం అని బిఆర్‌ఎస్ భావిస్తుందట.
గత ఎన్నికల సమయంలో కూడా ఎవరు ఊహించని విధంగా కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.అదే విధంగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెలిస్తే బిఆర్‌ఎస్ కు విజయం ఖాయమని, అందుకు ఇదే సరైన సమయమని బిఆర్‌ఎస్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది.
మరి కవితా అరెస్ట్ అయితే కేసిఆర్ చేసే వ్యూహరచన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు తెరతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.