వైద్య శాస్త్రం ఇంకా పూర్తి నివారణను కనుగొనని ప్రాణాంతక వ్యాధులు ఎన్నో ఉన్నాయి.ఆ వ్యాధులలో క్యాన్సర్( Cancer ) ఒకటి.
అయితే అమెరికాకు చెందిన 14 ఏళ్ల బాలుడు స్కిన్ క్యాన్సర్‌కు చికిత్స చేసే సబ్బును కనిపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాడు.ఈ బాలుడి పేరు హేమాన్ బెకెల్.
( Heman Beckele ) అతను 2023 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్( 3M Young Scientist Challenge ) విన్నర్‌గా నిలిచాడు, ఈ ఛాలెంజ్ అమెరికా అగ్రశ్రేణి యువ శాస్త్రవేత్తలను గుర్తించే ప్రతిష్టాత్మక పోటీ.ఈ కాంపిటీషన్లో అతను మరో తొమ్మిది మంది ఫైనలిస్టులను ఓడించి 25,000 డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.
స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ అని హేమాన్ ఈ సబ్బుకు పేరు పెట్టాడు.స్కిన్ క్యాన్సర్‌ను నివారించడానికి, నయం చేయడానికి ఈ సబ్బు సమర్థవంతమైన పరిష్కారం.దీని ధర చాలా తక్కువ.సబ్బు ధర కేవలం 10 డాలర్లు మాత్రమేనని, హానికరమైన యూవీ కిరణాల( UV Rays ) నుంచి చర్మాన్ని రక్షించే కణాలను పునరుత్పత్తి చేయడం ద్వారా సబ్బు పని చేస్తుందని ఈ బాలుడు వివరించాడు.
డెన్డ్రిటిక్ కణాలు అని పిలిచే ఆ కణాలు రోగనిరోధక వ్యవస్థను యాక్టివ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలతో పోరాడటానికి శరీరానికి సహాయపడతాయి.
తాను ఇథియోపియాను సందర్శించినప్పుడు, సూర్యరశ్మిలో( Sunlight ) నిరంతరం గడపాల్సి వచ్చిందని, దానివల్ల అక్కడ చర్మ క్యాన్సర్‌తో( Skin Cancer ) చాలామంది బాధపడుతున్నారని తాను తెలుసుకున్నానని ఈ బాలుడు చెప్పుకొచ్చాడు.అప్పుడే తనకు ఈ సబ్బు ( Soap ) గురించి ఆలోచన వచ్చిందని హేమాన్ వెల్లడించాడు.చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న వారికి, ఇతరులకు సహాయపడే మార్గాన్ని కనుగొనడానికి అతను పరిశోధన చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు.
తన సబ్బును రూపొందించడానికి, హేమాన్ డెన్డ్రిటిక్ కణాల పెరుగుదలను ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉన్న ఒక నమూనా సూత్రాన్ని రూపొందించడానికి కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించాడు.డెబోరా ఇసాబెల్లె అనే ఇంజనీరింగ్ నిపుణుడు అతనికి మార్గనిర్దేశం చేశాడు, ఇసాబెల్లె హేమాన్కు ఛాలెంజ్ పోటీలో నెగ్గెందుకు సహాయం చేశారు.తన సబ్బు మిలటరీకి ఉపయోగపడుతుందని, తరచూ కఠినమైన వాతావరణంలో పనిచేసేటప్పుడు, క్యాన్సర్ బారిన పడకుండా తమ చర్మాన్ని రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తన సబ్బు ఉపయోగపడుతుందని హేమాన్ అన్నారు.
ఇకపోతే హేమాన్ సబ్బు ఒక అద్భుతమైన ఆవిష్కరణ, ఇది లక్షల మంది జీవితాలను కాపాడుతుంది.
చాలా మంది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.యువ శాస్త్రవేత్తలు తమ సృజనాత్మకత, అభిరుచితో ప్రపంచాన్ని ఎలా మార్చగలరో చెప్పడానికి హేమాన్ ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.