బెంగళూరు( Bengaluru ) నగరం అనేక వింతలు, విశేషాలకు నిలయం అని చెప్పవచ్చు.ఇటీవల మరొక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నిహారిక రావు( Niharika Rao ) అనే యువతి ఆ విచిత్రానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.ఈ ఫోటోల్లో ఒక టమోటా దుకాణం( Tomato Shop ) ముందు ఒక మహిళ ఫొటో కనిపిస్తుంది.
ఆమె కళ్లను చాలా పెద్దదిగా చేసుకొని కోపంగా చూస్తుంటుంది.నుదుట పెద్ద ఎరుపు బొట్టు వేసుకోవడంతో ఆమె చాలా విచిత్రంగా, భయానకంగా కనిపిస్తుంది.
టమాటాల కొనేందుకు వచ్చిన వారిని అలా ఆమె కళ్ళు పెద్దవి చేసే గమనిస్తున్నట్లుగా కనిపిస్తోంది.దీన్ని చూస్తుంటే ఒక సీసీటీవీ కెమెరా లాగా ఆమె కళ్లు పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఈ పోస్ట్ కొద్దిరోజుల క్రితమే షేర్ చేయగా ఇప్పటికే 80,500 కంటే ఎక్కువ వ్యూస్, 1,500 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.ఈ ఫోటో గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొందరు ఆమె ఫోటో చెడు అదృష్టాన్ని దూరంగా ఉంచడానికి ఒక తాయత్తులా పనిచేస్తుందని అనుకుంటున్నారు, మరికొందరు ఆ కూరగాయల దుకాణం( Vegetable Shop ) ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఒక నెటిజన్ ఈ దుకాణం ఒక ప్రదేశానికి దగ్గరలో ఉందని గుర్తించినట్లు చెప్పాడు.దీంతో నిహారిక ఆ దుకాణం గురించి ఏదైనా కథలు తెలుసా అని అడిగింది.ఆ నెటిజన్ ఈ చిత్రాన్ని చెడు దృష్టిని దూరంగా ఉంచడానికి ఉపయోగిస్తారని, ఇటువంటి చిత్రాలు ఇటీవల చాలా దుకాణాల్లో కనిపిస్తున్నాయని చెప్పాడు.
ఈ పోస్ట్‌పై చాలా మంది ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.ఒక నెటిజన్ ఈ చిత్రాన్ని తనకు స్ఫూర్తినిచ్చే సాధనంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు, మరొకరు ఇది పాత కాలాలలోని నిఘా వ్యవస్థ లేదా సీసీటీవీ( CCTV ) లాంటిదని హాస్యంగా అన్నాడు.అంటే సీసీటీవీని ఆవిష్కరించడానికి ముందు జనాలు ఇలాంటి ఫోటోలు పెట్టి దొంగలను భయపెట్టేవారేమో అని సరదాగా అన్నారు.మరొక నెటిజన్ ఈ చిత్రం వల్ల తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని ఆటపట్టించాడు.