ఒకప్పుడు క్రికెట్( Cricket ) అంటే ఆత్మ అభిమానం… అందులో గెలిస్తే సంబరాలు చేసుకునే వాళ్ళం.పక్క దేశం వాళ్ళను ఓడిస్తే ఇండియా( India ) మొత్తం సంబరాలు జరిగేవి.
కానీ ఇప్పుడు ఆటస్వరూపం మారిపోయింది.డబ్బు మాత్రమే క్రికెట్ ని ఆటాడిస్తోంది.
పలు దేశాల్లో బాగా ఆడే ఆటగాళ్లను అలాగే మనదేశంలోని కొంతమందిని కొనుక్కొని ఐపీఎల్ పేరుతో పలు రాష్ట్రాలకు టీమ్స్ గా ఏర్పాటు చేసి వాటి మధ్య ఆట ఆడిపిస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు పలు టీమ్స్ ఓనర్స్.ఇది అందరికీ తెలిసిన విషయమే.
చాలా ఏళ్లుగా ఇండియాలో ఐపిఎల్( IPL ) జరుగుతుంది.నేషనల్ టీం కి ఆడుతున్న ప్లేయర్స్ అందరూ కూడా రకరకాల జట్లకు కెప్టెన్స్ గా లేదా జట్టులో ముఖ్యమైన ప్లేయర్స్ గా కొనసాగుతున్నారు.

సంతలో గొర్రెను వేలం వేసినట్టుగా ఆటగాళ్లను వేలంలో కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు.వారు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎంత పెద్ద ఆటగాడైనా సరే ఆ సమయానికి వచ్చి ఐపీఎల్ ఆడాల్సిందే.అందుకు బీసీసీఐ( BCCI ) కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పదు.ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే మిగతా షెడ్యూల్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి.ఇక్కడ వరకు బాగానే ఉంది.ఆడుతున్న వారికి డబ్బులు పెడుతున్నారు వారు కూడా బాగానే ఆడుతున్నారు.
కానీ ఇందులో పూర్తిగా లోపించింది ఏంటి అంటే మర్యాద.ఆటగాళ్లను సదరు జట్ల ఓనర్స్ ట్రీట్ చేస్తున్న విధానంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చ సాగుతుంది.
లక్నో జట్టు( Lucknow Team ) హైదరాబాద్ జట్టు పై ఓడిన తర్వాత కేఎల్ రాహుల్ తో( KL Rahul ) ఆ జట్టు ఓనర్ ప్రవర్తించిన విధానంపై అందరూ విమర్శలు చేస్తున్నారు.

ఇక్కడే మొదలైంది అసలు చర్చ.ఇదేమీ కొత్త కాదు ఇలా ఆటగాళ్లను వారు ఏదో ఒకటి మాట్లాడటం లేదా అరవడం చాలా ఏళ్ల నుంచి ఉంది.ఇప్పుడు మాత్రమే మీడియా కంట కనబడుతుంది.
ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది.ఇంతకుముందులా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రమే చర్చలు జరగడం లేదు.
మీడియా ఉందన్న భయం లేదు.ఆటగాళ్లు ఆటగాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ధోరణి లేదు.
కేవలం డబ్బులు మాత్రమే పరమావధిగా ఈ గేమ్స్ జరుగుతున్నాయి.ఇవి ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.
ఎందుకంటే కేవలం క్రికెట్ లోనే కాదు ఇది కబడ్డి( Kabaddi ) వంటి వాటికి కూడా పాకింది.మహిళా క్రికెట్ కూడా సాగుతుంది.
డబ్బులను పరమావధిగా పెట్టుకొని ఈ ఆటలు ఆడినన్ని రోజులు ఆటగాళ్లు కేవలం ఆటలో పావులుగా మాత్రమే ఉంటారు.ఇకనైనా ఆటకు, ఆటగాళ్లకు విలువ ఇవ్వండి.
దేశం పరువు కాపాడండి.డబ్బు కోసం ఆటలు ఆడడం ఆపేస్తే బాగుంటుంది.