మెగా కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్నారు.చిరంజీవి ( Chiranjeevi )కుటుంబంలో చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా నటుడుగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
అయితే వీరు హీరోలు కదా మరి వీరు ఎవరిని అభిమానిస్తారు, వీరి కుటుంబ సభ్యులను అభిమానిస్తారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.చాలా మంది రామ్ చరణ్ కుటుంబంలోని వారు రామ్ చరణ్ ని మాత్రమే అభిమానిస్తారు అని అనుకుంటారు.
కానీ ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తారు.ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయట వారిని ఎక్కువగా అభిమానిస్తున్నారు.

ముఖ్యంగా రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసనని తీసుకుంటే ఆమెకు చాలా ఇష్టమైన హీరో అల్లు అర్జున్( Allu Arjun ).తన సొంత భర్త ఎంత పెద్ద స్టార్ అయినప్పటికి ఆమె అతనిని కాకుండా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయిందట.అతడి నటనకు, డాన్స్ కి, స్టైల్ కి ఆమె పెద్ద ఫ్యాన్ అనే విషయం చాలా రోజుల తర్వాత బయటపడింది.అంతేకాదు రామ్ చరణ్ తల్లి చిరంజీవి భార్య అయిన సురేఖకు కూడా తన భర్త లేదా కొడుకు కాకుండా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అంటే చాలా ఇష్టమట.
అతని నటనకు ఆమె పెద్ద అభిమాని అని తెలుస్తోంది.ఇక రామ్ చరణ్ కి ఫేవరెట్ హీరో అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే.

చిన్నతనం నుంచి బాబాయ్ అంటే చరణ్ కి చాల ఇష్టం.అతడి కొంచం ఏజ్ వచ్చే సరికి బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )స్టార్ హెర్గా ఉన్నాడు కాబట్టి అతడిని చూస్తూ పెరిగారు.పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది అంటే చాలు రామ్ చరణ్ అక్కడ వాలిపోతాడు.అలాగే బాబాయ్ కోసం ఎలక్షన్స్ లో ప్రచారం కూడా చేస్తున్నాడు.మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి మంచి అభిమానం.నటుడు గానే కాకుండా ఇంటి సభ్యుడుగా కూడా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ని ఎంతో బాగా ఇష్టపడతాడు.
ఇక చిరంజీవికి ఇష్టమైన హీరో మాత్రం తన కొడుకు రామ్ చరణ్.మొదటి నుంచి రాంచరణ్ గొప్ప స్టార్ అవుతాడని చెబుతూ ఉండేవారు.
ఆయన అనుకున్నట్టుగానే రామ్ చరణ్ మంచి నటుడు అయ్యాడు.







