అమెరికా వెళ్లేందుకు అనుమతులు లభించిన తరువాత అమెరికా ప్రయాణం కోసం వేచి చూస్తున్న వారికి ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది.నిభంధనలను అనుగుణంగా వలస వాసులను తమ దేశంలోకి అనుమతిస్తోంది అమెరిక ప్రభుత్వం.
అయితే వలస వాసులు తమ దేశంలోకి వచ్చేందుకుగాను అమెరికా ఇచ్చే హెచ్-1బి వీసా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా మరింత మంది వలస వాసులు అమెరికాలోకి వచ్చేందుకు అనుమతి ఇచ్చినట్టయ్యింది.ఇప్పటికే హెచ్ -1బి వీసాను రెండు సార్లుగా లాటరీ తీసిన ప్రభుత్వం తాజాగా ముచ్చటగా మూడోసారి కూడా లాటరీ తీసింది.
ఈ పరిణామాలతో పలు కంపెనీలు నిపుణులైన ఉద్యోగులను అమెరికాకు పంపేందుకు అవకాసం వచ్చిందనే చెప్పాలి.
సహజంగా ప్రతీ ఏటా అమెరికా ప్రభుత్వం 85 వేల హెచ్ -1బి వీసాలు జారీ చేస్తోంది.
ఇప్పటికే పలు కంపెనీలు దాదాపు 3 లక్షల మందిని అమెరికా పంపేందుకు దరఖాస్తు చేసుకున్నాయట.అయితే ఈ మూడు లక్షల మందిలో సుమారు 1,50,000 మంది భారతీయులు ఉండటం గమనార్హం.
ఇదిలాఉంటే కంపెనీలు ముందుగానే తమ ఉద్యోగుల కోసం ఈ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కేవలం ఉద్యోగుల ప్రాధమిక వివరాలు తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కానీ లాటరీ తీసిన తరువాత వీరిలో ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు మాత్రం తప్పనిసరిగా పూర్తి వివరాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 లోగా పంపాలి సూచించింది.
అయితే అమెరికా ప్రభుత్వం లాటరీ విధానంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఈ పద్దతిని అవలంబించేది కానీ మూడవ సారి లాటరీ తీయడంపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.
అయితే కరోనా కారణంగా కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా పంపెలేక పోయాయి దాంతో వీసా కోటాలు పూర్తి చేసేందుకు మరో సారి లాటరీ నిర్వహించాల్సి వచ్చిందని అమెరికా న్యాయ పరిశీలనా నిపుణులు అంటున్నారు.అలాగే అమెరికా ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించే అవకాశం కూడా ఇందులో లేకపోలేదని ఒకే ఉద్యోగి వివిధ కంపెనీలతో ఉద్యోగానికి అప్ప్లై చేయించి కోటా పొందేందుకు కూడా అవకాశం ఉండిఉండచ్చని ఏది ఏమైనా అమెరికా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.