సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామంలో శుక్రవారం పిడుగుపడి మల్లెపూల లింగయ్య, యలకాని ఆంజనేయులుకు చెందిన 39 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.ఈ సందర్భంగా బాధిత గొర్రెల యాజమానులు మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిందని,రోజు వారీగా గొర్రెలను మేపుతున్న సమయంలో వర్షం
పడడంతో పక్కనే స్మశానవాటిక వద్ద చెట్టు కిందకు గొర్రెలు వెళ్ళాయన్నారు.
దీంతో ఒక్కసారిగా పిడుగు పడడంతో 300 గొర్రెల్లో 39 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని బోరున విలపించారు.దీనితో ఇద్దరికీ కలిపి సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు.ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.