నాటినుండి నేటి వరకు సినిమాలు తీయడంలో తెలుగు దర్శకులది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు.అయితే ఇక్కడ ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి.
ఎవరి ఆలోచనలకు తగ్గట్టు ఇక్కడ వారు ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీస్తూ ఉంటారు.పాతతరం దర్శకుల విషయానికి వస్తే ఎంతో మంది లెజెండరీ డైరెక్టర్లు ఎన్నో క్లాసిక్స్ తీసి చరిత్రలో నిలిచిపోయారనే చెప్పుకోవాలి.
అలాంటి డైరెక్టర్లలో పి.సి.రెడ్డి ఒకరు.పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి.( P Chandrasekhar Reddy ) ఈయన 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారు.ఈయన దాదాపు 11 సంవత్సరాలు దర్శకుడు వి.
మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంటుగా పనిచేశారు.ఆ తర్వాత పూలరంగడు సినిమాకు ఆదుర్తి సుబ్బారావు వద్ద కోడైరెక్టర్‌గా వర్క్ చేశారు.
కట్ చేస్తే, పి.సి.రెడ్డి తొలిసారి తన అనుభవంతో అనూరాధ అనే సినిమా దర్శకత్వం వహించారు.కాగా ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించగా, కొన్ని కారణాల వలన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత మళ్ళీ కృష్ణ హీరోగా అత్తలూ కోడళ్లు, శోభన్‌బాబు హీరోగా విచిత్ర దాంపత్యం చిత్రాలు చేయగా ఈ రెండు సినిమాలు ఒకేసారి 1971 ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యాయి.ఇక ఒకే రోజు విడుదలైన తన సినిమాల్లో మార్నింగ్ షో ఏది చూడాలి అనేది పి.సి.రెడ్డికి పెద్ద సమస్యగా మారగా, ఫస్ట్‌హాఫ్ విచిత్ర దాంపత్యం, సెకండాఫ్ అత్తలూ కోడళ్లు సినిమా తిలకించారట.కట్ చేస్తే… అత్తలూ కోడళ్లు, విచిత్ర దాంపత్యం చిత్రాలు( Vichithra Dampathyam) సూపర్‌హిట్ కావడంతో దర్శకుడికి మంచి పేరు వచ్చిందట!
హీరో కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్‌గా పి.సి.రెడ్డికి ఉంది.ఆయన దాదాపు కృష్ణతో 23 సినిమాలు చేశారు అంటే సామాన్యమైన విషయం కాదు.
మరో విషయం ఏమిటంటే… గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చెయ్యడంలో పి.సి.రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ పంచెకట్టి ( Krishna )నటిస్తే ఆ సినిమా సూపర్‌హిట్ అనే సెంటిమెంట్ క్రియేట్ అవ్వడానికి పి.సి.రెడ్డే కారణం అని చెప్పుకోవచ్చు.అదేవిధంగా కమర్షియల్ హీరోగా మంచి స్వింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌తో ఓ వృద్ధ పాత్ర చేయించి బడిపంతులు అనే సినిమా చేసి విజయం సాధించారు పి.సి.రెడ్డి.ఇక ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో మానవుడు దానవుడు, పాడిపంటలు, ఇల్లు ఇల్లాలు, నాయుడు బావ, పట్నవాసం, భోగభాగ్యాలు, బంగారు భూమి, నా పిలుపే ప్రభంజనం వంటి సూపర్‌హిట్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి.
పి.సి.రెడ్డి తన కెరీర్‌లో మొత్తం 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2022 జనవరి 3న కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో తుది శ్వాస విడిచారు.