మహిళ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా:పొదుపు సంఘాలలోని మహిళలకు ఎంబ్రాయిడింగ్,బేకరీ ఉత్పతులలో శిక్షణ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు డిఆర్డీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు.

 Everyone Should Work For Women Empowerment District Collector Tejas Nand Lal Paw-TeluguStop.com

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు సంఘాలలోని మహిళలకు ప్రస్తుత మార్కెట్ లో డిమాండ్ కి అనుగుణంగా ఉన్న ఎంబ్రాయిడింగ్,బేకరి ఉత్పతులలో మెరుగైన శిక్షణ ఇచ్చి సత్పలితాలు వచ్చేలా చూడాలని, మహిళ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం మహిళ సాధికారత కోసం మహిళ శక్తి పేరిట ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన లబ్ధిదారుల ఎంపిక,మైక్రో క్రెడిట్ ప్లాన్ బ్యాంకులో సమర్పించుట,వారికి కావలసిన శిక్షణలు జిల్లా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించాలని మరియు సుస్థిరంగా మరియు నిరంతరాయంగా వ్యాపారాలు నడపటానికి వారి ఉత్పత్తులకు బ్రాండింగ్ మార్కెటింగ్ పై సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చాలా కూలంకుషంగా సమీక్ష చేశారు.అదేవిధంగా ఇప్పటివరకు గ్రౌండ్ చేసిన యూనిట్లు ఏ విధంగా నడుస్తున్నాయి?వారు ఏ విధంగా అభివృద్ధి చెందారో?డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేయాలని ఆదేశించారు.ప్రతి నెల జిల్లా సమైక్య,మండల, గ్రామ సమైక్య సమావేశానికి,సంఘాల సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని,ఇంకా సంఘాల్లో లేని సభ్యులను కొత్త సంఘాలు వెంటనే చేపించాలని,స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్లను బలోపేతం చేసి ప్రైవేటు కంపెనీల డ్రెస్సులు కూడా కుట్టించి వారికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా చూడాలని ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశానికి డిఆర్డిఓ మధుసూదనరాజు, అడిషనల్ డిఆర్డిఓ రామ్ సురేష్,డీపీఎంలు ఏపీఎంలు,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube