రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ( District Collector Sandeep Kumar Jha )ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.ప్రజావాణి( Prajavani )లో వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ శాఖకు 91, ఉపాధి కల్పన శాఖకు 13, డీఆర్డీఓ 3, సిరిసిల్ల మున్సిపల్ 18, వేములవాడ మున్సిపల్ 3, ఎడి సర్వే 6, బి.సి.వెల్ఫేర్ 2, అగ్రికల్చర్ 2, ఎడ్యుకేషన్ 3, ఫారెస్ట్ 2, సివిల్ సప్లై 4, ఇరిగేషన్ 6, డి.ఎం.సివిల్ సప్లై 1, డి.ఎం.హెచ్.ఓ., 1, డి.పి.ఓ.5, ఎక్సైజ్ 2, ఎస్సీ కార్పొరేషన్ 1, పంచాయితి రాజ్ 2, 2బి.హెచ్.కే.2, ఎల్.డి.ఎం.1, సెస్ 8, ఎం.పి.డి.ఓ.ఇల్లంతకుంట 1, వేములవాడ 2, అర్.సి.ఓ.బి.సి.వెల్ఫేర్ 9, అర్.సి.ఓ.సోషల్ వెల్ఫేర్, 2, ఎస్.డి.సి.3, పోలీస్ 8, హాండ్లూమ్స్ & టెక్టైల్స్ 1 ఆయా శాఖలకు అన్ని కలిపి మొత్తం 202 వచ్చాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.